కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ సంక్షోభం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సిద్ధరామయ్య-డీకే.శివకుమార్ మధ్య ‘కుర్చీ’ వివాదం నడుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు రెండు వర్గాలు విడిపోయారు. ప్రస్తుతం రెండు గ్రూపుల మధ్య ఘర్షణ వాతావరణమే నెలకొన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Kochi: కొచ్చిలో అర్ధరాత్రి ప్రమాదం.. పగిలిన భారీ నీటి ట్యాంక్.. ఇళ్లు జలమయం
ఇదిలా ఉంటే కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి చేసుకోబోతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంలో మార్పులు-చేర్పులు చేయాలని సిద్ధరామయ్య భావిస్తున్నారు. ఇందుకోసం హైకమాండ్ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. అయితే నవంబర్ 15 వరకు కర్ణాటక నేతలెవరికీ అపాయింట్‌మెంట్ ఇచ్చేది లేదని అధిష్టానం పెద్దలు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇది అందరికీ వర్తిస్తుందని సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Bhopal: భోపాల్‌లో ఘోర విషాదం.. రోడ్డుప్రమాదంలో ఆసియా కప్ విజేత దుర్మరణం
ఇదిలా ఉంటే డీకే.శివకుమార్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఓట్ చోరీ అంశంపై ఢిల్లీ చేరుకున్నారు. ఏడు రోజుల్లోనే ఇది రెండో పర్యటన. అంటే ఢిల్లీ వేదికగా ఏదో జరగబోతుందన్న పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక సిద్ధరామయ్య వర్గంలోని కొందరు ఢిల్లీలో విందు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం అంతర్గతంగా బల ప్రదర్శనగా భావిస్తున్నారు.
