Site icon NTV Telugu

Shraddha Walkar Case: శ్రద్ధా వాకర్ హత్య.. అడవిలో ఎముకలు, ఇంట్లో రక్తం అవశేషాలు..

Shraddha Walkar Case

Shraddha Walkar Case

Shraddha Walkar Case-Body parts human, blood traces found in flat: ఢిల్లీలో 27 ఏళ్ల శ్రద్ధా వాకర్ హత్య కేసు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. అత్యంత కిరాతకంగా శరీరాన్ని 35 భాగాలు చేసి, 18 రోజుల పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో పడేశాడు నిందితుడు అఫ్తాబ్ పునావాలా. ఈ హత్య యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అత్యంత క్రూరంగా లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న ప్రియురాలిని చంపాడు అఫ్తాబ్. తాజాగా ఈ కేసులో పోలీసులు సాక్ష్యాలు వెతికే పనిలో ఉన్నారు. శ్రద్ధావాకర్ శరీర అవయవాలు పారేసిన ప్రాంతాల్లో పోలీసులు వెతుకున్నారు.

ఛత్తార్ పూర్ లోని ఒక అడవిలో కొన్ని ఎముకలు దొరికాయి. మానవశరర అవశేషాలుగా కనిపిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అఫ్తాబ్, శ్రద్ధావాకర్ కలిసి ఉన్న అపార్ట్మెంట్ లో రక్తపు జాడలను గుర్తించారు. దొరికిన అవశేషాలను ఫోరెన్సిక్ ల్యాబుకు పంపారు పోలీసులు. పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించినా.. దానికి సంబంధించిన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టాల్సి ఉంది. దీంతో పోలీసులు ఆధారాల కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఛత్తర్‌పూర్ పహాడీ శ్మశానవాటిక వెనుక ఉన్న ప్రాంతంలో సోమవారం వరకు 13 ఎముకలను వెలికితీశారు. ఇక్కడే శ్రద్ధ శరీర భాగాలను పడేసినట్లు నిందితులు అఫ్తాబ్ తెలిపాడు. శరీరాన్ని కోసిన ఆయుధాలు ఇంకా దొరకలేదు. వైద్యుల పరీక్షలో దొరికిన ఎముకలు మనిషివే అని తేలింది.

Read Also: Love Marriage: కర్కశత్వం.. ప్రేమ పెళ్లి చేసుకుందని కన్నకూతురికే శిరోముండనం

అఫ్తాబ్ అపార్ట్మెంట్ లో రక్తపు మరకలను కనుక్కున్నారు పోలీసులు. అయితే అధికారులు వెళ్లే సరికి శ్రద్ధా శరీరాన్ని భద్రపరిచిన ఫ్రిడ్జ్ అంతా శుభ్రంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఫ్రిడ్జ్ నుంచి ఎలాంటి ఆధారాలు లభించలేదు. ప్రస్తుతం కుళ్లిపోయిన ఎముకల నుంచి డీఎన్ఏని, శ్రద్ధా తండ్రి డీఎన్ఏతో పోల్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దొరికిన ఎముకలు పక్కటెముకలు, పెల్విక్ ప్రాంతాల్లోని ఎముకలుగా గుర్తించారు. అఫ్తాబ్ అపార్ట్మెంట్ లోని కిచెన్ సింక్, మార్చుల్ ప్లాట్‌ఫారమ్ చుట్టూ ఉన్న చెక్క క్యాబినెట్ల నుండి రక్త నమూనాలను సేకరించారు.

ఇదిలా ఉంటే అఫ్తాబ్ ను దోషిగా నిలబెట్టాలంటే హత్యకు ఉపయోగించిన ఆయుధం చాలా కీలకం అని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు చెప్పిన ప్రాంతంలో హత్య ఆయుధాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిద్దరికి ఫ్లాట్ దొరకడంలో సహాయపడిన స్నేహితుడు బద్రీ స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు. దీంతో పాటు ఛత్తర్ పూర్ లోని ఓ హోమ్ అండ్ కిచెన్ లో కత్తిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. దీంతో అక్కడి ఉద్యోగుల స్టేట్మెంట్ ని రికార్డు చేశారు.

Exit mobile version