NTV Telugu Site icon

Viral News: సీఎంకు చల్లారిన టీ.. అధికారికి షోకాజ్ నోటీసులు

Cold Tea To Madhyapradesh Cm

Cold Tea To Madhyapradesh Cm

ముఖ్యమంత్రి కోసం ఏర్పాటు చేసిన టీ చల్లారిపోయిందని మధ్యప్రదేశ్‌లో ఓ అధికారికి షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. టీ చల్లారిందని అధికారికి నోటీసులు ఇవ్వడం మధ్యప్రదేశ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కాగా.. ఆ నోటీసుల్ని ఉన్నతాధికారులు ఉపసంహరించుకున్నారు. మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని సదరు ఉద్యోగిని ఆదేశించిన ఉన్నతాధికారులు, సోషల్ మీడియాలో వచ్చిన వ్యతిరేకతతో వెనక్కు తగ్గారు. పట్టణ స్థానిక ఎన్నికల ప్రచారం కోసం మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సోమవారం భోపాల్ నుంచి రేవా వెళ్లారు. మధ్యలో ఖజురహో విమానాశ్రయంలో కాసేపు ఆగారు.

Mamata Benerjee: పానీపూరి అమ్మిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఎగబడిన జనం

ముఖ్యమంత్రి రాక సందర్భంగా అల్పాహారం ఏర్పాట్ల బాధ్యతను జూనియర్ పౌర సరఫరాల అధికారి రాకేశ్ కనౌహాకు ఉన్నతాధికారులు అప్పగించారు. ఆ సమయంలో చల్లారిపోయిన, నాసిరకం టీ ఇవ్వడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మాత్రం బాగా లేదంటూ అతడికి రాజ్‌నగర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ డీపీ ద్వివేది రాకేశ్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. సీఎంకు అలాంటి టీ ఎందుకు ఇచ్చారో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో కోరారు. కానీ ఇది సోషల్ మీడియాలో వైరల్ కాగా.. నోటీసులను ఉపసంహరించుకున్నారు.