Shloka Mehta: ఇంటర్నెట్‌ను ఆకట్టుకున్న ముఖేష్ అంబానీ పెద్ద కోడలు సింప్ల్‌సిటీ.. వీడియో వైరల్

  • ముఖేష్ అంబానీ బర్త్‌డే వేడుకల్లో ఫ్యామిలీ సందడి
  • ఇంటర్నెట్‌ను ఆకట్టుకున్న శ్లోకా మెహతా సింప్ల్‌సిటీ
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Shlokamehta

Shlokamehta

ముఖేష్ అంబానీ.. ప్రపంచ కుబేరుల్లో ఒకరు. ఏది కావాలన్నా క్షణాల్లో జరిగిపోతాయి. ఇక ఆయన పిల్లలైనా.. కోడళ్లు అయినా ఏది కోరుకున్నా జరుగుతాయి. అలాంటిది ముఖేష్ అంబానీ పెద్ద కోడలు శ్లోకా మెహతా వ్యవహరించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియా ప్రియులను చాలా బాగా ఆకట్టుకుంది. ఆమె సింప్ల్‌‌సిటీ, ఆమె డ్రస్ మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. అసలేం జరిగింది. అసలు కథేంటి? తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

ఏప్రిల్ 19న ముఖేష్ అంబానీ పుట్టినరోజు జరిగింది. ఈరోజున కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలోని ప్రసిద్ధ సిద్ధవినాయక ఆలయానికి వచ్చారు. ముఖేష్ అంబానీతో పాటు ఆయన భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాష్, అనంత్ అంబానీ, కోడళ్లు శ్లోకా మెహతా, రాధికా మర్చంట్ ఉన్నారు. అంతేకాకుండా కుమార్తె ఇషా అంబానీ కవల పిల్లలు కృష్ణ, ఆద్య కూడా వచ్చారు.

అయితే ఈ సందర్భంగా శ్లోకా మెహతా నీలి రంగు సూట్ ధరించి.. చాలా సింపుల్‌గా.. హుందాగా కనిపించారు. ఆడపడుచు కొడుకు కృష్ణను ఒడిలో కూర్చోబెట్టుకుని చెప్పులు చేత్తో పట్టుకున్నారు. ఎలాంటి మేకప్ లేకపోయినా చాలా అందంగా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. సెక్యూరిటీ ఉన్న కూడా చెప్పులు వేరే వాళ్లకు ఇవ్వకుండా మేనల్లుడి చెప్పులు స్వయంగా మోయడంతో అందరినీ ఆకట్టుకుంది.