NTV Telugu Site icon

Big News : మసీదు బావిలో బయటపడ్డ శివలింగం.. ఎక్కడంటే..?

Gyanvapi Masjid

Gyanvapi Masjid

భోళాశంకరుడు కొలువుదీరిన కాశీలో ఓ పురాతన శివలింగం బయటపడింది. కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ఆనుకొని.. జ్ఞానవాపి-శృంగార్ గౌరీదేవి కాంప్లెక్స్ ఉంది. అయితే.. ఇందులోనే మసీదు కూడా ఉండడం గమనార్హం. జ్ఞానవాపి-శృంగార్ గౌరీదేవి కాంప్లెక్స్ పశ్చిమాన హిందూ ఆలయాన్ని ధ్వసం చేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని.. దీంతో కొందరు మహిళలు ఇక్కడ రోజువారీ ప్రార్థనలకు అనుమతించాలని, హిందూ దేవతల ఆనవాళ్లను తేల్చాలని కోరుతూ వారణాసి కోర్టును ఆశ్రయించారు. దీంతో.. కోర్టు విచారణ చేపట్టి కమిషనర్, న్యాయవాదుల బృందం ఏర్పాటు చేసి అక్కడకు పంపించింది.

అయితే.. తొలుత వీడియోలు తీసేందుకు, మసీదు ఆవరణ లోపలకు వచ్చేందుకు కమిషనర్, న్యాయవాదుల బృందంను మసీదు నిర్వహణ కమిటీ అనుమతించలేదు. దీంతో.. కోర్టు మరోసారి ఆదేశాలు జారీ చేయడంతో, గట్టి బందోబస్తు మధ్య శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజుల పాటు పరిశీలిన చేసింది కమిషనర్, న్యాయవాదుల బృందం. అయితే.. ఈ నేపథ్యంలోనే.. మసీదు లోపలి బావిలో శివలింగాన్ని కనుగొన్నట్లు న్యాయవాది విష్ణు జైన్ వెల్లడించారు. రక్షణ కోరుతూ సివిల్ కోర్టును ఆశ్రయించనున్నట్టు ఆయన తెలిపారు.

Show comments