Site icon NTV Telugu

Pahalgam Terror Attack: నిన్ను చంపను.. వెళ్లి మోడీకి చెప్పు.. మహిళతో టెర్రరిస్ట్ సంభాషణ

Pahalgamterrorattack6

Pahalgamterrorattack6

‘‘నిన్ను చంపను.. వెళ్లి మోడీ’’కి చెప్పు అంటూ కర్ణాటక మహిళతో ఉగ్రవాది సంభాషించాడు. కళ్ల ముందే భర్త ప్రాణాలు కోల్పోవడంతో ఆ వివాహిత విలవిలలాడిపోయింది. తన భర్త మృతదేహాన్ని విమానంలో శివమొగ్గకు తరలించాలని ప్రభుత్వాధికారులను వేడుకుంటోంది.

ఇది కూడా చదవండి: Pakistan: కశ్మీర్ ఉగ్రదాడిపై స్పందించిన పాక్ రక్షణ మంత్రి.. ఏమన్నారంటే?

కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన మంజునాథ్-భార్య పల్లవి, కుమారుడితో కలిసి కాశ్మీర్‌లోని పహల్గామ్‌కు వెళ్లారు. కుటుంబ సభ్యులు ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఇంతలోనే ముష్కరులు తుపాకులతో విరుచుకుపడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారని.. హిందువులను టార్గెట్‌ చేసుకుని కాల్పులు జరిపారని పల్లవి తెలిపింది. మహిళలు, పిల్లలను ఏమీ చేయలేదని.. పురుషులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారని పేర్కొంది. దాడి జరిగినప్పుడు ముగ్గురు, నలుగురు ఉగ్రవాదులే ఉన్నారని చెప్పింది.

ఇది కూడా చదవండి: Terror Attack: ఆర్మీ యూనిఫాంలో ఉగ్రవాదులు.. అసలైన భారత సైనికులను చూసి భయపడ్డ బాధితులు (వీడియో)

తన కళ్ల ముందే భర్తను చంపేశారని.. నా భర్తే లేనప్పుడు నేనెందుకు నన్ను కూడా చంపేయండి అని పల్లవి అడిగితే.. నిన్ను చంపను వెళ్లి ఈ విషయాన్ని మోడీకి చెప్పాలని ఉగ్రవాది అన్నట్టుగా పల్లవి తెలిపింది. దాడి జరగగానే స్థానికులు సహాయం చేసేందుకు వచ్చారని.. ముగ్గురు వ్యక్తులు తనను రక్షించారని చెప్పింది. తన భర్త మృతదేహాన్ని తరలించేందుకు విమానం ఏర్పాటు చేయాలని ఆమె కన్నీటి పర్యాంతం అయింది.

ఇది కూడా చదవండి: Pahalgam Terror Attack: 5 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయిన నేవీ ఆఫీసర్

Exit mobile version