Site icon NTV Telugu

Delhi Car Blast: షాహీన్, ముజమ్మిల్ ఫొటో వెలుగులోకి.. ఓ షోరూమ్‌లో ఏం చేశారంటే..!

Delhi Car Blast10

Delhi Car Blast10

ఢిల్లీ బ్లాస్ట్‌ దర్యాప్తు కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా కీలక ఫొటోలు వెలుగులోకి వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా డాక్టర్ షాహీన్ భారీ కుట్రలకు ప్రణాళికలు రచించింది. ఉగ్ర దాడులకు కర్త, కర్మ, క్రియ మొత్తం షాహీనే అని అధికారులు గుర్తించారు. తాజాగా సన్నిహిత డాక్టర్ ముజమ్మిల్‌తో కలిసి ఒక షోరూమ్‌లో కారు కొనుగోలు చేస్తున్న ఫొటో బయటకు వచ్చింది.

ఇది కూడా చదవండి: Delhi Car Blast: ఢిల్లీ బ్లాస్ట్‌లో ఉమర్‌కు సహకరించిన కీలక వ్యక్తి ఇతడే.. వెలుగులోకి ఫొటో

సెప్టెంబర్ 25, 2025న షాహీన్ షాహిద్ పేరుతో బ్రెజ్జా కారును కొనుగోలు చేసింది. కారు కొనుగోలు తర్వాత డెలివరీ సమయంలో షోరూమ్‌లోనే ముజమ్మిల్‌తో కలిసి ఫొటో దిగింది. ఈ కారు మందుగుండు సామాగ్రి తరలింపు కోసం ఉపయోగించినట్లు కనిపెట్టారు. ఈ కారును నవంబర్ 12న అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయంలోని పార్కింగ్ స్థలంలో గుర్తించారు.

ఇది కూడా చదవండి: Prashant Kishor: నా సంకల్పం నెరవేరేదాకా వెనక్కి తగ్గేదే లే.. ఓటమిపై ప్రశాంత్ కిషోర్ తొలి స్పందన

ఇక ఉగ్ర డాక్టర్లంతా కోడ్ భాష ఉపయోగించేవారు. ‘ఔషధం’, ‘ఆపరేషన్’ అనే కోడ్ భాషను ఉపయోగించారు. ఇక షాహీన్ ఓ వైపు ఉగ్ర దాడులకు కుట్ర చేస్తూనే.. ఇంకోవైపు మానవ బాంబర్ల కోసం యువతల కోసం చురుకుగా పని చేసినట్లుగా కనిపెట్టారు. ఇక ఢిల్లీ బ్లాస్ట్‌లో డాక్టర్ ఉమర్‌కు సహకరించిన కీలక సహ కుట్రదారుడు డానిష్‌ను శ్రీనగర్‌లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఇక నవంబర్ 10న జరిగిన బ్లాస్ట్‌లో ఇప్పటి వరకు 13 మంది చనిపోయారు.

Exit mobile version