NTV Telugu Site icon

Bomb Threat to Airports: దేశంలోని 7 ప్రధాన ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు..

Bomp Threat

Bomp Threat

దేశంలోని పలు ఎయిర్‌పోర్టులను పేల్చేస్తామంటూ బెదిరింపు ఈమెయిల్‌ రావడంతో కలకలం రేగింది. ఢిల్లీ, ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌, లక్నో, చండీఘడ్‌, జైపూర్‌ ఎయిర్‌పోర్ట్‌లను పేల్చేస్తామని ఈమెయిల్‌ రావడంతో ఆయా రాష్ట్రాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. బాంబ్‌ స్క్వాడ్‌తో ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు చేపట్టారు. అధికారిక కస్టమర్ కేర్ ఐడీకి ఇమెయిల్ రావడంతో అన్ని విమానాశ్రయంలో కలకలం రేగింది. ఈ మేరకు సమాచారం అందుకున్న సీఐఎస్‌ఎఫ్ అధికారులు విచారణ చేపట్టారు. స్థానిక పోలీసుల సహాయంతో విమానాశ్రయంతో పాటు అక్కడ ల్యాండింగ్ చేసే విమానాలను సైతం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

Also Read: Chandrababu Naidu: కుప్పంలో రౌడియిజం పెరిగిపోయింది.. వైసీపీ చేసిన అవినీతిని కక్కిస్తా..

అయితే ఇప్పటి వరకు పోలీసులు జరిపిన తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కానీ, పేలుడుకు సంబంధించిన పరికరాలు లభించకపోవడం విశేషం. కాగా ప్రస్తుతం విమానాశ్రయ ఉన్నతాధికారులు, పోలీసులతో కలిసి ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపారనే దానిపై ఆరా తీస్తున్నారు. డిసెంబర్ 27 బుధవారం రాత్రి 10:23 గంటలకు ఒక ఇ మెయిల్ వచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా గతంలోనూ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా బాంబు బెదిరింపు రావడం గమనార్హం. దీంతో అక్కడ తనిఖీలు నిర్వహించగా ఎలాంటి బాంబు పేలుడు వస్తువులు లభించలేదు.

Also Read: Karnataka: స్కూల్‌ విద్యార్థులతో టాయిలెట్లు శుభ్రం.. నెలలో మూడో ఘటన