Site icon NTV Telugu

Gujarat: సూరత్ కోర్టు సంచలన తీర్పు..

Gujarat

Gujarat

Gujarat: సూరత్ కోర్టు సంచలన తీర్పు వెలవరించింది. రెండేళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేసిన యువకుడికి మరణశిక్ష విధిస్తూ బుధవారం తీర్పునిచ్చింది. రెండేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో 23 ఏళ్ల యువకుడికి గుజరాత్‌లోని సూరత్ కోర్టు బుధవారం మరణశిక్ష విధించింది. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. గుజరాత్‌లో కామంతో కన్నుమిన్నూ కానక.. రెండేళ్ల పసిపాపపై అత్యాచారం, హత్యకు పాల్పడ్డిన కీచకుడుకి సూరత్ కోర్టు షాక్ ఇచ్చింది. దారుణానికి పాల్పడిన యువకుడికి అదనపు సెషన్స్ జడ్జి మరణశిక్ష విధించారు. దాంతోపాటు బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 302, 376, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద ఇస్మాయిల్ దోషిగా నిర్థారించారు. నిందితుడికి మరణశిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది, ఇది అరుదైన కేసు అని పేర్కొంది.

Read also: Fake Universities: దేశంలో 20 ఫేక్‌ యూనివర్సిటీలు.. జాబితా విడుదల చేసిన యూజీసీ

సూరత్‌లోని సచిన్ ఇండస్ట్రియల్ ఏరియాలోని కప్లేతా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి తండ్రికి ఇస్మాయిల్ స్నేహితుడు. ఫిబ్రవరి 27న ఇస్మాయిల్‌ ఆమెకు భోజనం, పానీయం ఇప్పిస్తానని చెప్పి సమీపంలోని దుకాణానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత బాలికపై అత్యాచారం చేసి కత్తితో నరికి చంపాడు. మృతదేహాన్ని పొలంలో పడేసిన తర్వాత అతను అక్కడి నుంచి పారిపోయాడు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. మరుసటి రోజే అతన్ని అరెస్టు చేశారు. తరువాత కేసును కొనసాగించిన పోలీసులు విచారణ పూర్తి చేసి కోర్టుకు వివరాలు ఇచ్చారు. దీంతో కోర్టు మరణశిక్షను విధించింది.

Exit mobile version