Site icon NTV Telugu

PUBG Love Story: సీమా హైదర్ పాకిస్తాన్ తిరిగి రావాలి.. లేకుంటే ముంబై తరహా దాడి..

Seema Haider

Seema Haider

PUBG Love Story: పబ్జీ లవ్ స్టోరి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పాకిస్తాన్ కు చెందిన సీమా హైదర్, భారత్ కు చెందిన సచిన్ మధ్య ప్రేమ వ్యవహారం ఇండియాలోనే కాదు పాకిస్తాన్ లో కూడా చర్చనీయాంశంగా మారింది. తన నలుగురు పిల్లలతో కలిసి పాకిస్తాన్ నుంచి దుబాయ్, నేపాల్ మీదుగా సీమా భారత్ చేరుకుని సచిన్ ని వివాహం చేసుకుంది. సీమా తన భర్త కోసం హిందువుగా మారి పూజ చేయడం, బొట్టు పెట్టుకోవడం సోషల్ మీడియాలో చాలా వైరల్ అయ్యాయి.

Read Also: Gautam Gambhir: ఉచితాలకు పోతే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయి..ఢిల్లీ ప్రజలు మెలుకోవాలి..

ఇదిలా ఉంటే పాకిస్తాన్ జాతీయురాలైన సీమా హైదర్ తిరిగి పాకిస్తాన్ రాకుంటే, 26/11 ముంబై దాడి తరహాలో మరో దాడి చేస్తామంటూ ఓ వ్యక్తి ముంబై పోలీసులకు బెదిరింపు కాల్ చేశాడు. సీమా హైదర్ పాక్ రాకుంటే, ముంబై తరహా దాడి తప్పదని, మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవాలని, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ దీనికి బాధ్యత వహించాలని ఉర్దూలో ఓ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే దీనిని విచారిస్తున్న పోలీసులు ఇది ఫేక్ కాల్ అని తేల్చారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

పాకిస్తాన్ కి చెందిన సీమా హైదర్, యూపీకి చెందిన సచిన్ లాక్ డౌన్ సమయంలో పబ్జీ గేమ్ లో పరిచయమయ్యారు. క్రమంగా వీరద్దరు ప్రేమలో పడ్డారు. ఈ ఏడాది నేపాల్ లో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ తరువాత మరోసారి పాకిస్తాన్ వెళ్లిన సీమా తన నలుగురు పిల్లలతో కలిసి మళ్లీ నేపాల్ మీదుగా భారత్ చేరింది. అయితే ఆమెకు సంబంధించిన పత్రాల కోసం లాయర్ ని కలవడంతో విషయం బయటకు వచ్చింది. దీంతో అధికారులు వీరిద్దరిని అరెస్ట్ చేశారు. ఇటీవల వీరిద్దరికి బెయిల్ లభించింది. తాను తన భర్తలాగే హిందువునని, భారతీయురాలి అని సీమా చెబుతోంది. తనను పాకిస్తాన్ పంపొద్దని వేడుకుంటోంది. పాక్ కు వెళ్లడం కన్నా ఇక్కడే విషం తాగి మరణిస్తానని చెబుతోంది. మరోవైపు సీమా పాకిస్తాన్ ఐఎస్ఐ గూఢాచారి అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. తాను అలాంటి దాన్ని కాదని సీమా ఈ ఆరోపణల్ని ఖండించింది.

Exit mobile version