NTV Telugu Site icon

భార‌త్‌లో డెల్టా ప్ల‌స్ వేరియంట్‌…

భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం ప‌డుతుంద‌ని సంబ‌ర‌ప‌డేలోగా శాస్త్ర‌వేత్త‌లు మ‌రో నిజం బ‌య‌ట‌పెట్టారు.  భార‌త్‌లో డెల్టాప్ల‌స్ వేరియంట్‌ను గుర్తించిన‌ట్టు తెలిపారు.  అయితే, దీని వ్యాప్తి ఇండియాలో పెద్ద‌గా లేద‌ని, ఆంధోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని సీఎస్ఐఆర్‌-ఐజీఐబి శాస్త్ర‌వేత్త వినోద్ స్కారియా ట్వీట్ చేశారు.  ఈ వేరియంట్ వ‌ల‌న వ్యాధి తీవ్ర‌త ఎంత అధికంగా ఉంటుంది అనే విష‌యం ఇంకా తేలాల్సి ఉంద‌ని అన్నారు.  కే417ఎన్ మ్యూటేష‌న్ కార‌ణంగా బి1.617.2 వేరియంట్‌కు కార‌ణం అవుతుంద‌ని, ఈ వేరియంట్ శ‌రీరంలోని క‌ణాల‌లోకి చొచ్చుకుపోయి వ్యాధి తీవ్ర‌త‌ను పెంచేందుకు కే417 ఎన్ మ్యూటేష‌న్ దోహ‌దం చేస్తుంద‌ని, కానీ ఇండియాలో కే417 ఎన్ మ్యూటేష‌న్ వేరియంట్ పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌ని, యూర‌ప్‌,  అమెరికా దేశాల్లో ఈ వేరియంట్ క‌నిపిస్తుంద‌ని తెలిపారు. 

Show comments