NTV Telugu Site icon

Mohali: పార్కింగ్ విషయంలో ఘర్షణ.. యువ శాస్త్రవేత్త హత్య

Mohalimurder

Mohalimurder

పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదంలో ఓ యువ శాస్త్రవేత్త అభిషేక్ స్వర్ంకర్ (39) హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పంజాబ్‌లోని మొహాలీలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిషేక్ స్వర్ంకర్.. స్విట్జర్లాండ్‌లో పనిచేసి ఇటీవలే భారత్‌కు వచ్చారు. ఇక్కడ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్‌)లో ప్రాజెక్ట్ సైంటిస్ట్‌గా పని చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Tirupati Laddu Case: టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం..

అభిషేక్ స్వర్ంకర్.. తన తల్లిదండ్రులతో కలిసి మొహాలిలోని సెక్టార్ 67లో నివాసం ఉంటున్నారు. అభిషేక్ స్వస్థలం జార్ఖండ్‌లోని ధన్‌బాద్. అభిషేక్ రచనలు అంతర్జాతీయ పత్రికల్లో కూడా ప్రచురితమయ్యాయి. స్విట్జర్లాండ్‌లో పని చేసి ఇటీవలే ఇండియాకు వచ్చాడు. ఈ మధ్యే కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. అతడి సోదరి కిడ్నీని దానంగా ఇచ్చింది. ప్రస్తుతం అభిషేక్‌కు డయాలసిస్ జరుగుతోంది. అయితే మంగళవారం ఇంటి ముంగిట పార్కింగ్ విషయంలో ఘర్షణ తలెత్తింది. పొరుగుంటి వ్యక్తి.. అభిషేక్‌ను తోసేయగా నేలపై పడ్డాడు. అనంతరం కుటుంబ సభ్యులు విడిపించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అభిషేక్ స్వర్ంకర్ నేలకూలిపోయాడు. స్థానికుల సాయంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. కానీ ఏ మాత్రం ప్రయోజనం లేదు. చనిపోయినట్లుగా వైద్యులు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీకెమెరాలో రికార్డ్ అయ్యాయి.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్త కుటుంబం డిమాండ్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌ ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Russia-Ukraine: శాంతి చర్చల్లో భాగంగా రష్యా ఏం చేసిందంటే…!