Site icon NTV Telugu

Farm Laws: నిపుణుల కమిటీ నివేదిక బహిర్గతం.. ఏముందంటే..?

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు… దేశవ్యాప్తంగా దుమారం రేపాయి.. రైతులు నెలల తరబడి దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనకు దిగారు.. దీంతో.. కేంద్రం వెనక్కి తగ్గింది. అయితే, ఈ చట్టాలపై సుప్రీం ధర్మాసనం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక బహిర్గతమైంది. సాగు చట్టాలు రైతులకు ప్రయోజనకరంగా ఉన్నందున… వాటిని రద్దు చేయవద్దంటూ నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలకు దారితీయడంతో.. వీటిని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఈ నివేదికకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయింది.

Read Also: TPCC: మళ్లీ హీట్‌.. రేవంత్‌రెడ్డి కౌంటర్‌ ఎటాక్‌ స్టార్ట్..!

సాగు చట్టాలపై భారత అత్యున్నత న్యాయస్థానం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక.. గతేడాది మార్చి 19నే సుప్రీంకోర్టుకు చేరింది. అందులో కీలక అంశాలను కమిటీ సిఫార్సు చేసింది. కనీస మద్దతు ధరను నిర్ణయించడంలో రాష్ట్రాలకే పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలని సూచించింది. మార్చి 19, 2021న సుప్రీంకోర్టుకు నివేదిక అందింది. నివేదికను బహిర్గతం చేయాలని.. నిపుణులు సుప్రీంకు లేఖ రాసినా స్పందించలేదు. దీంతో కమిటీ సభ్యులు.. దీన్ని బహిర్గతం చేశారు. సాగు చట్టాలు రద్దు అయినందున దీనికి ఎటువంటి ప్రాధాన్యం లేదని వెల్లడించారు. భవిష్యత్తులో వ్యవసాయ రంగంలో చట్టాలు రూపొందించడానికి ఇవి ఉపయోగపడుతాయని అంటున్నారు. కమిటీ ముందుకు వచ్చిన 73 రైతు సంఘాల్లో 61 సంఘాలు సాగు చట్టాలకు మద్దతు ఇచ్చినట్లు నివేదికలో వెల్లడైంది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సంయుక్త కిసాన్ మోర్చా పేరుతో ఏర్పాటైన 40 సంఘాలు మాత్రం తమ అభిప్రాయాలను కమిటీ ముందు చెప్పలేదు.

Exit mobile version