Holi: హోలీ పండగ దగ్గర పడటంతో ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. హోలీ, శుక్రవారం నమాజ్ ఒకే రోజు ఉండటంతో ముఖ్యం మతపరంగా సున్నితంగా ఉన్న ప్రాంతాల్లో భద్రతను మరింత పెంచుతున్నారు. గత నవంబర్‌లో యూపీలో సంభాల్ అల్లర్లకు కారణమైన జామా మసీదులో పాటు మరో 10 మసీదులను ముసుగులతో కప్పనున్నారు.
మార్చి 14న హోలీ ఊరేగింపు మార్గంలోని జామా మసీదు ఇతర మసీదులను ప్లాస్టిక్ షీట్లు, టార్పాలిన్‌తో కప్పాలని పోలీసులు నిర్ణయించారు. రెండు వర్గాల పరస్పర ఒప్పందం తర్వాత హోలీ ఊరేగింపు మార్గంలో ఉన్న అన్ని మతపరమైన ప్రదేశాలను కవర్ చేస్తున్నట్లు ఏఎస్పీ శ్రీశ్చంద్ర తెలిపారు. ఈ వారం ప్రారంభంలో సంభాల్ పోలీస్ అధికారి అనుజ్ కుమార్ చౌదరి మాట్లాడుతూ..‘‘హోలీ ఏడాదికి ఒకేసారి వస్తుంది, శుక్రవారం ప్రార్థనలు ప్రతీ శుక్రవారం జరుగుతాయి. ఎవరికైనా హోలీ రంగులతో ఇబ్బంది ఉంటే ఇళ్లలోనే ఉండాలి’’ అని సూచించారు. అయితే, దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఎస్పీ నుంచి విమర్శించాయి. సీఎం యోగి మాత్రం పోలీస్ అధికారికి మద్దతుగా నిలిచారు.
Read Also: Lady Aghori : వేములవాడకు లేడీ అఘోరీ.. అడ్డుకునేందుకు పోలీసుల మోహరింపు
గతేడాది నవంబర్‌లో జామా మసీదు వివాదంగా నిలిచింది. ప్రాచీన హరిహర్ మందిరాన్ని కూల్చేసి, ఈ మసీదును నిర్మించారని కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, మసీదు సర్వేకి కోర్టు ఆదేశించింది. ఈమేరకు సర్వే సమయంలో ముస్లిం మూక ప్రభుత్వ అధికారులపై దాడులు చేసింది. ఈ ఘర్షణల్లో ఐదుగురు మరణించగా, 20కి పైగా పోలీసులకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే సంభాల్‌లో హోలీ సమయంలో సున్నిత పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే, తాజాగా బీజేపీ నేత రఘురాజ్ సింగ్ ముస్లిం పురుషులు హోలీ వేడుకల్లో అసౌకర్యాన్ని నివారించడానికి టార్పాలిన్లతో తయారుచేసిన హిజాబ్ ధరించాలని వివాదాస్పద వ్యాఖ్యలు చేుశారు. బీహార్ దర్భంగా మేయర్ కూడా హోలీ వేడుకల సమయంలో జుమ్మా (శుక్రవారం ప్రార్థనలు) కోసం రెండు గంటల విరామాన్ని సూచించడం కూడా వివాదాన్ని రేకెత్తించింది.