Salman Khan Receives Another Death Threat From A Caller Named Roki Bhai: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్‌కి మరో బెదిరింపు కాల్ వచ్చింది. ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి.. ఈనెల 30వ తేదీన సల్మాన్‌ని చంపేస్తానని ఒక వ్యక్తి బెదిరించాడు. తనని తాను రాకీ భాయ్‌గా పరిచయం చేసుకున్న ఆ కాలర్.. తాను రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌ని చెందినవాడినని పేర్కొన్నాడు. దీంతో.. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆ వ్యక్తి ‘గో-రక్షక్’ విభాగానికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. అతని కోసం గాలిస్తున్నారు. మరోవైపు.. ఈ బెదిరింపు ఫోన్ కాల్ రాగానే అప్రమత్తమైన పోలీసులు, సల్మాన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
Beautician Cheated: బ్యూటీషియన్‌కి టోకరా.. లాభమని చెప్పి నిండా ముంచేశారు
ఈ బెదిరింపు ఫోన్ కాల్‌పై ముంబై పోలీసులు స్పందిస్తూ.. ‘‘పోలీస్ కంట్రోల్ రూమ్‌కి నిన్న (10-04-23) ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తనని తాను రాకీ భాయ్‌గా పరిచయం చేసుకున్నాడు. తాను రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కి చెందినవాడినని కూడా అతడు పేర్కొన్నాడు. తన గురించి పరిచయం చేసుకున్నాక.. ఈ నెల 30వ తేదీన సల్మాన్ ఖాన్‌ని చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. వెంటనే మేము కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించాం. సల్మాన్ నివాసం వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశాం. ప్రస్తుతం ఆ బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నాం. మా ప్రాథమిక విచారణలో భాగంగా.. అతడు గో-రక్షక్ విభాగానికి చెందినవాడిగా తేలింది. ఈ ఫోన్ కాల్ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని విచారణ చేపట్టాం’’ అంటూ చెప్పుకొచ్చారు.
Virupaksha Trailer: రుద్రవనాన్ని కాపాడే విరూపాక్ష వచ్చేశాడు
కాగా.. సల్మాన్‌కి ఇలాంటి హత్యా బెదిరింపులు రావడం ఇదే తొలిసారి కాదు. గత నెలలోనే సల్మాన్‌కు రెండుసార్లు బెదిరింపు ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ వచ్చాయి. అంతకుముందు.. 2018లోనే కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ ఎదుర్కొన్న సల్మాన్‌ను హత్య చేస్తానంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కోర్టు ఆవరణలోనే బెదిరించాడు. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాను హత్య అనంతరం.. అతడ్ని చంపినట్లే సల్మాన్‌ను చంపుతామంటూ బిష్ణోయ్ సన్నిహితుడు బెదిరించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో.. సల్మాన్ హై సెక్యూరిటీ బుల్లెట్ ప్రూఫ్ కారును రీసెంట్‌గానే కొనుగోలు చేశాడు.
