Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్‌.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ

Tvk Flag Colours Spark Cont

Tvk Flag Colours Spark Cont

Tamil Nadu: తమిళనాడులో విజయ్‌ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత వరుసగా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు.. తాజాగా, విజయ్ ప్రభుత్వం మరో వివాదంలో చిక్కుకుంది. సేలంలో 25 కొత్త ప్రభుత్వ టౌన్ బస్సులను టీవీకే పార్టీ జెండాలో ఉండే పసుపు, ఎరుపు రంగుల్లో సిద్ధం చేయడం రాజకీయ చర్చకు దారితీసింది. జాన్సన్‌పేట్ ప్రాంతం నుంచి ఈ కొత్త బస్సుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, ప్రభుత్వ బస్సులకు టీవీకే పార్టీ జెండాను పోలిన రంగులు వేయడంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రభుత్వ ఆస్తులకు అధికార పార్టీ రంగులను ఉపయోగించడంపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమిళనాడులో ఎప్పుడూ లేని సంస్కృతిని తీసుకొస్తున్నారంటూ డీఎంకే విమర్శలు గుప్పిస్తోంది. అసలు బస్సులకు ఈ రంగులను ఎవరి ఆదేశాలతో వేశారు? ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమా? స్థానిక స్థాయిలో జరిగిన రంగుల ఎంపికా? అన్నదానిపై రవాణాశాఖ నుంచి మాత్రం స్పందన లేదంటున్నారు.. కాగా, పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. ప్రభుత్వ కార్యాలయాలు.. బస్సులు.. ఇలా పబ్లిక్‌ ప్రాపర్టీకి అధికార పార్టీ జెండాను పోలిన రంగులను అదుతూ వివాదాలు కొనితెచ్చుకున్న సందర్భాలు ఎన్నో లేకపోలేదు..