Site icon NTV Telugu

S Jaishankar: చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ.. ఎల్ఏసీపై కీలక చర్చ..

S Jai Shankar

S Jai Shankar

S Jaishankar: కజకిస్తాన్ వేదికగా ఆస్తానాలో జరుగుతున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమ్మిట్‌కి భారతదేశం తరుపున విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యితో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు ముఖ్యంగా భారత-చైనా సరిహద్దు వివాదంపై చర్చించారు. వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) వెంబడి ఉన్న లడఖ్ ప్రాంతంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంపై చర్చలు జరిపారు.

Read Also: B.Krishna Mohan: బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే..?

వాంగ్ యితో జరిగిన సమావేశంలో జైశంకర్ సరిహద్దు ప్రాంతాల్లో అపరిష్కృతంగా మిగిలిన సమస్యలకు త్వరగా పరిష్కారం అవసరమని చెప్పారు. దౌత్య, సైనిక మార్గాల ద్వారా ప్రయత్నాలను రెట్టింపు చేయాలని ఇరువురు అంగీకరించారు. ఎల్ఏసీని ఇరు దేశాలు గౌరవించడంతో పాటు సరిహద్దు ప్రాంతాలలో శాంతి మరియు ప్రశాంతతను నిర్ధారించడం చాలా అవసరం అని భారత్ నొక్కి చెప్పింది. పరస్పర గౌరవం, పరస్పర సున్నితత్వం, పరస్పర ఆసక్తి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు మార్గనిర్దేశం చేస్తాయి అని జైశంకర్ ట్వీట్ చేశారు.

Exit mobile version