Site icon NTV Telugu

S Jaishankar: 6 గంటలకే “కెప్టెన్ మోదీ”తో ఆట మొదలు.. జైశంకర్ నోట క్రికెట్, ఆర్ఆర్ఆర్..

Jaishankar

Jaishankar

S Jaishankar Explains How Government Functions Under “Captain Modi”: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన పనితనంలో ది బెస్ట్ ఫారన్ మినిస్టర్ అనిపించుకుంటున్నారు. ఎలాంటి వేదికైనా, ఏ దేశం అయినా భారత్ విషయంలో ప్రశ్నిస్తే ధీటుగా సమాధానం ఇస్తున్నారు. భారత విదేశాంగ విధానంలో సమర్థవంతమైన మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా భారత ప్రతిష్టను మరింతగా పెంచారు. జైశంకర్ ను ఎవరైనా ప్రశ్నించాలనుకుంటే ఎవరైనా ఒకటి రెండు సార్లు ఆలోచించాల్సిందే. అలాంటి వాక్చాతుర్యం ఆయన సొంతం.

ఇదిలా ఉంటే శుక్రవారం విదేశాంగ శాఖ భాగస్వామ్యంతో అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్(ఓఆర్ఎఫ్) నిర్వహించిన ఫ్లాగ్‌షిప్ థింక్-ట్యాంక్ ఈవెంట్ రైసినా డైలాగ్‌లో జైశంకర్ మాట్లాడారు. క్రికెట్ పరిభాషను ఉపయోగిస్తూ ఆయన ప్రధాని మోదీ ప్రభుత్వం, ఆయన పనితీరును వివరించారు. భారతదేశం, యూకే మధ్య సంబధాలను వివరిస్తూ ట్రిపుల్ ఆర్ సినిమా గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి యూకే మాజీ ప్రధాని టోనీబ్లెయర్, మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ కూడా పాల్గొన్నారు.

Read Also: I Love Manish Sisodia: జైలుకు వెళ్లిన సిసోడియాకు పిల్లలతో మద్దతు.. ఆప్‌పై బీజేపీ ఆరోపణలు

జైశంకర్ మాట్లాడుతూ.. కెప్టెన్ మోదీ( ప్రధాని మోదీ)తో ఉదయం 6 గంటలకే నెట్ ప్రాక్టీస్ ప్రారంభం అవుతుందని.. అది చాలా సమయం కొనసాగుతుందని ప్రభుత్వ పనితీరును వివరించారు. మా కెప్టెన్ రాణింగల బౌలర్ ఉంటే, అతడికి బాల్ ఇస్తారని, కెప్టెన్ మోడీ తన బౌలర్లకు కొంత స్వేచ్ఛనిస్తాడని. అతను మీకు అవకాశం ఇస్తే ఆ వికెట్ పడుతుందని అతను ఆశిస్తున్నారని అన్నారు. అయితే కొన్ని సందర్భాల్లో క్లిష్టమైన నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. లాక్ డౌన్ నిర్ణయం చాలా కఠినమైనదని, వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ నిర్ణయం తీసుకోకుంటే ఏం జరిగేదో అని అన్నారు.

ప్రపంచం క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నందున, ఎక్కువ మంది ప్రజలు ప్రపంచ పరిణామాలపై ఆసక్తి కనబరుస్తున్నారని, మరొకటి భారత్ ప్రపంచీకరణ అని అన్నారు. క్రికెట్ జట్టులాగే తాము స్వదేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా మ్యాచులు గెలవాలని కోరుకుంటున్నామని జైశంకర్ అన్నారు. బ్రిటన్ కన్నా భారత్ పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం, క్రికెట్ పై ఆధిపత్యం వంటి వాటిపై చర్చ జరిగింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రస్తావిస్తూ.. ఇది బ్రిటీష్ కాలంలో సంబంధం కలిగి ఉందని, సంక్లిష్టమైన చరిత్ర కలిగి ఉంటే దానిలో ప్రతికూలత కూడా ఉంటుందనేది నిజమని, అనుమానాలు, పరిష్కరించలేని సమస్యలు ఉంటాయని ఆయన అన్నారు.

Exit mobile version