Site icon NTV Telugu

Mohan Bhagwat: సింధీ క్యాంప్‌లో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Mohan Bhagwat

Mohan Bhagwat

చాలా మంది సింధీలు పాకిస్థాన్‌కు వెళ్లలేదని.. మనమంతా అవిభక్త భారతదేశం అని గుర్తించుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. సత్నాలో సింధీ క్యాంప్ గురుద్వారా ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఈ రోజు మనం మనల్ని మనం భిన్నంగా పిలుచుకుంటాం.. కానీ మనం ఏ మతం లేదా భాషతో అనుబంధం కలిగి ఉన్నా.. నిజం ఏమిటంటే మనమందరం ఒకటే.. మనమంతా హిందువులమే.’’ అని వ్యా్ఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Gurugram: గురుగ్రామ్‌లో దారుణం.. ఉపాధ్యాయురాలిపై జిమ్ ట్రైనర్లు గ్యాంగ్‌రేప్

‘‘చాలా మంది సింధీ సోదరులు ఇక్కడ కూర్చున్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నాను. వారు పాకిస్థాన్‌కు వెళ్లలేదు. వారు అవిభక్త భారతదేశంలో ఉన్నారు. పరిస్థితులు ఆ ఇంటి నుంచి ఇక్కడికి పంపాయి. ఎందుకంటే ఆ ఇల్లు-ఈ ఇల్లు భిన్నంగా లేవు. భారతదేశం మొత్తం అంతా ఒకే ఇల్లు. కానీ ఎవరో మన ఇంటిలోని వస్తువులు దొంగిలించారు. వారు దానిని ఆక్రమించారు. రేపు దానిని మనం తిరిగి తీసుకోవాలి. అందువల్ల మనం అవిభక్త భారతదేశం అని గుర్తుంచుకోవాలి.’’ అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: PM Modi: నా ఆలోచనలు మృతుల కుటుంబాలతోనే ఉన్నాయి.. డార్జిలింగ్‌ విషాదంపై మోడీ ఆవేదన

‘‘తెలివైన బ్రిటీషర్లు మనతో పోరాడి పాలించారు. మన ఆధ్యాత్మిక మనస్సాక్షిని లాక్కొని మనకు భౌతికమైన వస్తువులను ఇచ్చారు. అప్పటి నుంచి ఒకరికొకరు భిన్నంగా భావించాం. కొన్నిసార్లు తమను తాము హిందువులుగా భావించని వ్యక్తులు విదేశాలకు వెళతారు. అయినప్పటికీ ప్రపంచం వారిని హిందువులుగానే పిలుస్తుంది. ఇది వారిని ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే వారు అలా గుర్తించబడకుండా ఉండటానికి తమ వంతు ప్రయత్నం చేస్తారు. కానీ నిజం ఏమిటంటే వారు హిందువులే.’’ అని ఆయన చెప్పుకొచ్చారు.

 

Exit mobile version