Site icon NTV Telugu

Robbery in Amritsar: అచ్చం సినిమా తరహా దోపీడి గన్‌ గురిపెట్టి..

Amruthsar

Amruthsar

Robbery in Amritsar: పంజాబ్‌ అమృత్‌ సర్‌ లో ఓ కార్యాలయానికి వెళ్లి అక్కడున్న వ్యక్తిపై గన్‌ గురిపెట్టి దోపిడి చేసిన ఘటన సంచలనంగా మారింది. అచ్చం సినిమా తరహాలో ఓ ట్రావెల్స్‌ కార్యాలయంలో దొంగలు భీభత్సం సృష్టించారు. అమృత్‌ సర్‌ లోని జందియాలా గురు ప్రాంతంలో ఉన్న ధామి టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ అనే కార్యాలయానికి ఇద్దరు మామూలుగా ప్రయాణికుల్లా వెల్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో.. వారితో తెచ్చకున్న గన్‌ ను వారిపై గురిపెట్టారు.

Read also:Praveen Paruchuri: మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ నిర్మాత ప్రవీణ కొత్త చిత్రం !

వారి దగ్గర వున్న డబ్బునంతా బయటకు తీయాలంటూ భయపెట్టారు దీంతో.. ట్రావెల్స్‌ కార్యాలయంలోని వారు వారి దగ్గర వున్న డబ్బునంతా దుండగులకు అప్పగించారు మొత్తం 2లక్షల వరకు వుంటుందని ట్రావెల్స్‌ కార్యాలయం వారు తెలపారు. దుండగులు నల్లటి మాస్క్‌ ధరించి వచ్చారని అన్నారు. గన్‌ గురిపెట్టడంతో.. ఏంచేయాలో తెలియలేదని అన్నారు. ఈ విషయంపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ దృశ్యాలన్నీ సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. సీసీఫోటేజ్‌ ఆధారంతో దొంగలను పట్టుకునే ప్రయత్నంలో పడ్డారు పోలీసులు.
T20 World Cup: ఐర్లాండ్‌పై శ్రీలంక సునాయాస విజయం

Exit mobile version