Site icon NTV Telugu

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు-కారు ఢీ, 9మంది దుర్మరణం

Road Accident

Road Accident

Road accident: పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లాలో బస్సు-కారు ఢీకొన్న ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు మరణించారు. ప్రభుత్వ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ఘటనాస్థలికి భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. బీర్భూమ్ జిల్లాలోని మల్లార్‌పూర్‌లోని రోడ్డు నంబర్ 14లో మంగళవారం సాయంత్రం ప్రభుత్వ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కారులో ఉన్న 9 మంది మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న మల్లార్‌పూర్‌, రాంపూర్‌హట్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక అధికారులు, సిబ్బంది కూడా ఘటనాస్థలికి చేరుకుని కారులోంచి ప్రయాణికుల మృతదేహాలను వెలికితీశారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో రాంపూర్‌హట్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం స్థానికులు రోడ్డును దిగ్బంధించారు.

Telangana Rains: గోదావరిలో పెరిగిన వరద.. ప్రమాద హెచ్చరిక జారీ

పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. జనాలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరగడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆగ్రహంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ప్రభుత్వ ప్యాసింజర్ బస్సు సియురి వైపు వెళుతోందని పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కారులో డ్రైవర్‌తో సహా మొత్తం 10 మంది ఉన్నారు. కారులో ఉన్నవారంతా కూలీలని వెల్లడించారు. ఎదురుగా వేగంగా వస్తున్న ప్రభుత్వ బస్సు వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో కారు పేలిపోయింది. కారును ఢీకొట్టిన తర్వాత బస్సు కారును చాలా దూరం లాగింది. ఇంతలో కారులో ఉన్న 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. కారు డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Exit mobile version