Site icon NTV Telugu

Road Accident: ఘోరప్రమాదం.. ఆరుగురు మృతి.. మద్యం మత్తే కారణం!

Road Accident In Banda

Road Accident In Banda

Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని బండాలో శుక్రవారం కారు టెంపోను ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు మరణించగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి టెంపో వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఏడుగురు గాయపడగా.. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Blast at Cricket Stadium: మ్యాచ్ జరుగుతుండగా క్రికెట్ స్టేడియంలో పేలుడు.. వీడియో వైరల్

ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని, అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని బండా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అభినందన్ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Exit mobile version