NTV Telugu Site icon

Armed Forces: సాయుధ బలగాల్లో పెరుగుతున్న ఆత్మహత్యలు.. 13 ఏళ్లలో 1,532 మంది ఆత్మహత్య

Armed Forces

Armed Forces

Armed Forces: చేతుల్లో ఆయుధం కలిగి ఉంటున్న వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు ఈ మధ్యకాలంలో కొంత పెరుగుతున్నాయి. అయితే వారు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఉద్యోగ ఒత్తిడి ఒక కారణమవుతుంటే.. ఇతర కారణాలు కూడా ఉంటున్నాయి. సాయుధ బలగాల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నట్టు కేంద్రం జారీ చేసిన లెక్కలు చెబుతున్నాయి. గడచిన 13 ఏళ్లలో 1,532 మంది సాయుధులు ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం మొన్న జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రకటించింది. విధి నిర్వహణ కోసం ఇచ్చే ఆయుధంతో ఎదుటివారిని హతమార్చేలా విచక్షణ కోల్పోతున్నారు… లేదంటే తమను తాము కాల్చుకుని జీవితాన్ని ముగించేస్తున్నారు.

Read Also: Heath Streak Dies: క్యాన్సర్‌తో పోరాడి.. 49 ఏళ్లకే కన్నుమూసిన క్రికెట్ దిగ్గజం!

సాయుధ అధికారిగా ప్రజలకు సేవలందించాల్సిన పోలీసులు ఇలా చేస్తుండటంపై పోలీసు వర్గాల్లో ఆందోళ వ్యక్తమవుతోంది. ఇటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? వృత్తిపరమైన పని ఒత్తిడిని జయించేందుకు పోలీస్‌శాఖ అనుసరిస్తున్న వ్యూహాలు ఏంటి? తదితర అంశాలపై పోలీస్‌ ఉన్నతాధికారుల్లోనూ చర్చ జరుగుతోంది. వాటిని నివారించడానికి తగిన మార్గాలను వెతుకుతున్నట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఇటీవల జైపూర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో.. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్‌పీఎఫ్‌) కానిస్టేబుల్‌ చేతన్‌ సింగ్‌ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి తన పైఅధికారితోపాటు మరో ముగ్గురిని చంపేశాడు. గత 13 ఏళ్లలో కేంద్ర సాయుధ బలగాలైన సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, సశస్త్ర సీమాబల్, ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీస్, సీఐఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్, ఎన్‌ఎస్‌జీలకు చెందిన 1,532 మంది ఆత్మహత్య చేసుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. సాయుధ బలగాల్లో ఆత్మహత్యలపై లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ రాతపూర్వక సమాధానంలో పేర్కొన్నారు. ఈ ఏడాది (2023)లోనూ జనవరి నుంచి జూలై నెలాఖరు వరకు 71 మంది సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. వీటిని నివారించేందుకు సమగ్ర చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి తెలిపారు. సాయుధ బలగాలు ఆత్మహత్యలు చేసుకోవడం లేదా తోటి సిబ్బందిపై కాల్పులు జరపడానికి కార ణాలు విశ్లేషించేందుకు కేంద్ర ప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్‌ కమిటీ గత జనవరిలో సమగ్ర నివేదికను సమర్పించింది. అందులో పేర్కొన్న ప్రధా న అంశాలు సర్వీ స్‌–వ ర్కింగ్‌ కండిషన్స్, వ్యక్తిగత, కుటుంబ కారణాలు సాయుధ పోలీసుల ఆత్మహత్యలకు అలాగే తోటి సిబ్బంది, ఇతరులపై కాల్పులు జరపడానికి కారణమవు తున్నాయని నివేదికలో పేర్కొంది.