NTV Telugu Site icon

PM Modi: ‘‘సంవిధాన్ హత్య దివాస్‌’’పై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..

Pm Modi

Pm Modi

PM Modi: మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ 1975, జూన్ 25న ‘ఎమర్జెన్సీ’ విధించారు. అయితే, ఈ జూన్ 25వ తేదీని ప్రతీ ఏడాది ‘‘సంవిధాన్ హత్యా దివాస్’’గా జరుపుకోవాలని కేంద్రం ఈ రోజు నిర్ణయం తీసుకుంది. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఎమర్జెన్సీ విధించిన సమయంలో ఏం జరిగిందనే విషయాలను ఈ రోజు గుర్తు చేస్తుందని ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం అన్నారు. ఎక్స్ వేదికగా ఆయన మాట్లాడుతూ..‘‘ భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ద్వారా కాంగ్రెస్ చీకటి రోజును ఆవిష్కరించింది. ఎమర్జెన్సీ కారణంగా నష్టపోయిన ప్రతీ వ్యక్తికి నివాళులర్పించే రోజు’’ అని ఆయన ట్వీట్ చేశారు.

Read Also: Giorgia Meloni: నాటో సమ్మిట్‌కి బైడెన్ ఆలస్యం.. “జార్జియా మెలోని” ఎక్స్‌ప్రెషన్స్ వైరల్..

1975 ఎమర్జెన్సీ సమయంలో అమానవీయ బాధలను భరించిన వారందరి ధైర్యాన్ని జూన్ 25న స్మరించుకోవాలని అమిత్ షా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘‘జూన్ 25, 1975న, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ, నియంతృత్వ ఆలోచనా ధోరణిని ప్రదర్శించి, దేశంపై ఎమర్జెన్సీని విధించడం ద్వారా మన ప్రజాస్వామ్యం యొక్క ఆత్మపై దాడి చేశారు. ప్రతీ ఏడాది జూన్ 25వ తేదీని ‘సంవిధాన్ హత్యా దివాస్’గా పాటించాలి’’ అని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు తన ట్వీట్‌లో పేర్కొన్నారు.