NTV Telugu Site icon

Election schedule: 2 రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

Delhiec

Delhiec

దేశ వ్యాప్తంగా రెండు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.  హర్యానా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూలను ఈసీ విడుదల చేసింది. జమ్మూకాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో 90 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

జమ్మూకాశ్మీర్‌..

జమ్మూకాశ్మీర్‌లో 3 విడతల్లో పోలింగ్
సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1న పోలింగ్
అక్టోబర్ 4న జమ్మూకాశ్మీర్ కౌంటింగ్

 

మొదటి ఫేజ్ ఎన్నికలకు ఆగస్టు 20-08-2024న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ చివరి తేది 27-08-2024న ముగియనుంది. పోలింగ్ మాత్రం 18-09-2024న జరగనుంది. ఇక రెండో విడత పోలింగ్‌కి 29-08-2024న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్‌కు చివరి గడువు 05-09-2024న ముగియనుంది. పోలింగ్ మాత్రం 25-09-2024న జరగనుంది. చివరి విడత పోలింగ్ కోసం 05-09-2024న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ గడువు 12-09-2024న ముగియనుంది. పోలింగ్ మాత్రం 01-10-2024న జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4న విడుదల కానున్నాయి.

హర్యానా…

హర్యానాలో ఒకే విడతలో జరిగే ఎన్నికలకు 05-09-2024న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లకు చివరి గడువు 12-09-2024న ముగినుంది. ఓటింగ్ మాత్రం 01-10-2024న జరనుంది. ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4న విడుదల కానున్నాయి.

Show comments