RBI ఆదేశాలను పాటించలేదని … సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాలను పర్యవేక్షక పరిశీలనల ఆధారంగా, ఆ ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపమని సలహా ఇస్తూ PhonePeకి నోటీసు జారీ చేసినట్లు అపెక్స్ బ్యాంక్ తెలిపింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ కు సంబంధించి కొన్ని నిబంధనలు పాటించని కారణంతో ఫోన్ పే సంస్థకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 21 లక్షల జరిమానా విధించింది.
‘ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్’ (PPIs) కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు PhonePe లిమిటెడ్‌పై 21 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ శుక్రవారం తెలిపింది. అక్టోబర్ 2023 నుండి డిసెంబర్ 2024 వరకు దాని కార్యకలాపాలకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ కంపెనీపై చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించిందని RBI ఒక ప్రకటనలో తెలిపింది.
పూర్తి వివరాల్లోకి వెళితే… అక్టోబర్ 2023 నుండి డిసెంబర్ 2024 వరకు ఫోన్ పే కార్యకలాపాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ తనిఖీలు నిర్వహించింది. దీంతో ఫోన్ పేలో ఉన్న లోపాలను ఆర్బీఐ గుర్తించింది. RBI ఆదేశాలను పాటించలేదని, ఆదేశాలను పాటించడంలో విఫలమైనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చెప్పాలని.. PhonePeకి నోటీసు జారీ చేసినట్లు ఆర్బీఐ వెల్లడించింది.
RBI తనిఖీలో PhonePe ఎస్క్రో అకౌంట్లో కొన్ని రోజులు నిధులు తక్కువగా ఉన్నట్లు గుర్తించింది. వ్యాపారులకు చెల్లించాల్సిన మొత్తం కంటే ఎస్క్రో అకౌంట్లో తక్కువ బ్యాలెన్స్ ఉన్నట్లు గమనించింది. అకౌంట్లో నిధులు మొత్తం తక్కువగా ఉన్న విషయాన్ని RBIకి వెంటనే తెలియజేయడంలో కూడా PhonePe విఫలమైంది. RBI ఈ జరిమానా నిబంధనల ఉల్లంఘన వల్ల మాత్రమే విధించినట్లు స్పష్టం చేసింది. దీంతో PhonePe వినియోగదారుల లావాదేవీలపై ఏమాత్రం ప్రభావం పడదని వెల్లడించింది. PhonePeపై జరిమానాలు ఇదే మొదటిసారి కాదు. 2019లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ (FPI) నిబంధనలను పాటించనందుకు 1 కోటి జరిమానా విధించగా, 2020లో ఇతర నియంత్రణ ఉల్లంఘనలపై 1.39 కోట్ల జరిమానా విధించింది.
