Ravneet Singh Bittu: కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు రాజీనామా.. ఆమోదం

  • మోడీ కేబినెట్ నుంచి కేంద్రమంత్రి ఔట్
  • కేంద్రమంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు రాజీనామా
  • వెంటనే ఆమోదించిన రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము
Ravneet Singh Bittu1

Ravneet Singh Bittu1

దేశ వ్యాప్తంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేస్తుండగా.. అనూహ్యంగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు రాజీనామా చేయడం.. ఆమోదించడం జరిగిపోయింది. ప్రధాని మోడీ సూచన మేరకు వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. రవ్‌నీత్ సింగ్ రాజీనామాను ఆమోదించారు. ఆకస్మిక పరిణామంలో రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు కేంద్ర మంత్రివర్గం నుంచి తన రాజీనామాను సమర్పించారు. రాష్ట్రపతి వెంటనే రాజీనామాను ఆమోదించారు.