NTV Telugu Site icon

Ratan Tata Health Rumors: నా ఆరోగ్యంపై వచ్చే పుకార్లలో నిజం లేదు: రతన్ టాటా

Ratan

Ratan

Ratan Tata Health Rumors: ప్రముఖ సామాజిక కార్యకర్త, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా (86) ఆరోగ్యం క్షీణించడంతో ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరారని ప్రచారం కొనసాగుతుంది. ఈరోజు (సోమవారం) ఉదయం ఆయనకు రక్తపోటు తగ్గిపోవడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని బ్రీచ్ క్యాండీ హస్పటల్ లో అత్యవసర గదికి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం వచ్చింది. అయితే దీనిపై తాజాగా, రతన్ టాటా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా, నా ఆరోగ్యం గురించి ఇటీవల పుకార్లు వ్యాపించాయని నాకు తెలుసు.. ఈ వాదనలు నిరాధారమైనవని అందరికీ తెలియజేస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.

Read Also: Varun Tej : ఒక్క మాటతో ఓజీ సినిమాపై అంచనాలను డబుల్ చేసిన వరుణ్ తేజ్

అలాగే, నా వయస్సు, సంబంధిత వైద్య పరిస్థితుల కారణంగా నేను ప్రస్తుతం ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాను అని టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా వెల్లడించారు. ఎవరు ఆందోళనకు గురి కావొద్దు అని చెప్పారు. నేను ఆరోగ్యంగా, ఉత్సాహంతో ఉన్నాను.. కొంతమంది అసత్య ప్రచారం, మీడియా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండవలసిందిగా అభ్యర్థిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చారు.

Show comments