NTV Telugu Site icon

Ranveer Allahbadia: “తల్లిదండ్రుల సె**క్స్” కామెంట్స్.. క్షమాపణలు చెప్పిన యూట్యూబర్

Ranveer Allahbadia

Ranveer Allahbadia

Ranveer Allahbadia: ప్రముఖ యూట్యూబర్, పాడ్‌కాస్టర్ రణవీర్ అల్లాబాడియా చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించాయి. సాధారణ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఇతను చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు న్యాయవాదులు ఇతడిపై ఫిర్యాదు చేశారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Read Also: Bangladesh: “ఆపరేషన్ డెవిల్ హంట్‌” తో షేక్ హసీనా మద్దతుదారుల్ని టార్గెట్ చేస్తున్న యూనస్ సర్కార్..

మొత్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో రణవీర్ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. దేశవ్యాప్తంగా విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ‘‘నా వ్యాఖ్యలు అనుచితమైనవే కాకుండా, ఫన్నీ కాదు, హాస్యం నా బలం కాదు, నేను క్షమాపణలు చెబుతున్నా’’ అంటూ ఎక్స్‌లో ఒక వీడియో సందేశంలో క్షమాపణలు చెప్పారు.

‘‘ఇండియాస్ గాట్ లాలెంట్ షో’’లో రణవీర్ అత్యంత అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. షోకి వచ్చిన ఒక మహిళా కంటెస్టెంట్‌తో..‘‘ మీ తల్లిదండ్రులు సెక్స్ చేయడం జీవితాంతం చూస్తావా..? లేదా ఒక సారి వారితో కలిసి దీన్ని శాశ్వతంగా ఆపేస్తావా..?’’ అంటూ అడిగాడు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా షోకి హాజరైన వారు షాక్ అయ్యారు. ఈ కామెంట్స్‌పై అందరు మండిపడటంతో అతను క్షమాపణలు చెప్పాడు.