Randeep Hooda: యాక్టర్, డైరెక్టర్ రణదీప్ హుడా నటించిన ‘‘స్వతంత్ర వీర సావర్కర్’’ సినిమా డైరెక్టర్‌కు 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ డెబ్యూ డైరెక్టర్ అవార్డు లభించింది. సెప్టెంబర్ 22న గుజరాత్‌లోని ఏక్తానగర్ లో జరిగిన కార్యక్రమంలో అవార్డ్ అందించారు. ఈ అవార్డు కార్యక్రమానికి ముందు రణదీప్ హుడా తన సినిమా గురించి మాట్లాడుతూ..‘‘భారతదేశ స్వాతంత్య్రం కేవలం అహింస ద్వారానే వచ్చిందని అందరూ అనుకుంటారు, అది నిజం కాదు, సాయుధ విప్లవం కూడా జరిగింది’’ అని అన్నారు.
సుభాష్ చంద్రబోస్ నుంచి వీర్ సావర్కర్ వరకు చాలా మంది విప్లవ పంథాను ఎంచుకున్నట్లు చెప్పారు. ఈ చారిత్రక విషయాన్ని తన సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ సినిమా రూపొందించినట్లు రణదీప్ హుడా తెలిపారు. సాయుధ విప్లవంలో సావర్కర్ కీలకంగా ఉన్నట్లు తాను భావిస్తున్నారని ఆయన చెప్పారు. స్వతంత్ర వీర్ సావర్కర్ డైరెక్టర్‌గా రణదీప్ హుడాకు తొలి సినిమా.

