NTV Telugu Site icon

RamaJanma Bhumi: 24 జనవరి నుంచి భక్తులకు రామ్‌లాలా దర్శనభాగ్యం

Ramajanma Bhumi

Ramajanma Bhumi

RamaJanma Bhumi: అయోధ్యలోని రామజన్మభూమిలో నిర్మితం కానున్న రామాలయం త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది జనవరి నుంచి భక్తులకు రామ్‌లాలా దర్శనభాగ్యం కలగనుంది. ఇందుకు సంబంధించిన నిర్మాణ పనులను మందిర నిర్మాణ సమితి చకచకా నిర్వహిస్తోంది. త్వరగా పనులను పూర్తి చేసి రామ మందిరాన్ని ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఆయోధ్యలోగల రామజన్మభూమిలో ‍ప్రతిష్టాత్మకంగా రామాలయం నిర్మితం కానున్న విషయం తెలిసిందే. నిర్మాణ పనులలో భాగంగా గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణ ‍ప్రక్రియ పూర్తయ్యింది. ఫస్ట్‌ఫ్లోర్‌ పనులు ప్రారంభమయ్యాయి. మొదటి ఫ్లోర్‌ పనులు 2024 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారు. మొదటి ఫ్లోర్‌కు సంబంధించి పిల్లర్లు నిలబెట్టే పనులు ప్రారంభమయ్యాయి. మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఆలయ ట్రస్టు సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం 2024 జనవరి 14 నుంచి 24 వరకు విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరగనున్నాయి. అంటే 2024 జనవరి నుంచి భక్తులకు రామ్‌లాలా దర్శనభాగ్యం కలుగనుంది.

Read also: Tomato Price: దేశంలో భారీ వర్షాలు… డబుల్ సెంచరీ దిశగా టమాటా ధరలు

మందిర నిర్మాణ సమితి ఆలయ నిర్మాణానికి సంబంధించిన పలు వివరాలను వెల్లడించింది. నేటివరకూ భద్రతాకారణాల రీత్యా మీడియాను కూడా ఆలయ నిర్మాణ పరిసరాల్లోకి అనుమతించలేదు. ఆలయ నిర్మాణంలో ఇప్పటికే గర్భగృహం పూర్తయ్యింది. దీనిలోని గల 166 స్తంభాలపై వివిధ దేవీ దేవతా మూర్తుల విగ్రహాలను తీర్చిదిద్దే పనులు అత్యంత వేగంగా కొనసాగుతున్నాయి. అలాగే ఫస్ట్‌ ఫ్లోర్‌ మండపంలో తలుపులు, స్తంభాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆలయ ట్రస్టు జనరల్‌ సెక్రటరీ చంపత్‌రాయ్‌ ఈ నిర్మాణ పనులకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్‌లోని 166 స్తంభాలపై ప్రస్తుతం దేవీదేవతా శిల్పాలను చెక్కుతున్నారు. ప్రదక్షిణ మార్గంలోని ఈ స్థంభాలకు అద్భుతమైన రూపాన్ని ఇస్తున్నారు. ఇందుకోసం చేతి కళాకారులు నిరంతరం శ్రమిస్తున్నారు. 10 మంది కళాకారులు పిల్లర్ల రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ఆలయ ట్రస్టు సభ్యుడు డాక్టర్ మిశ్రా తెలిపిన వివరాల ప్రకారం విగ్రహాలు తీర్చిద్దేపనిని వేగంగా పూర్తి చేసేందుకు కళాకారుల సంఖ్యను పెంచుతామన్నారు. ఆలయం కింది అంతస్తులో ఉన్న గర్భగుడిలో 2024 జనవరిలోనే రాంలాలా దర్శనం ప్రారంభమవుతుందని తెలిపారు.

Read also; OPPO Reno 10 Series Launch: నేడే ఒప్పో రెనో 10 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ డీటెయిల్స్ ఇవే!

నైపుణ్యం గలిగిన శిల్పుల బృందాలు రాంలాలా విగ్రహాన్ని రూపొందిస్తున్నాయని డాక్టర్ అనిల్ మిశ్రా తెలిపారు. 2023 అక్టోబర్ నాటికి ఆలయ కింది అంతస్తు నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మార్బుల్‌ ఫ్లోర్‌ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. దీనికితోడు ఆలయ లైటింగ్, ఆధునిక మరుగుదొడ్లు, విద్యుత్ కేంద్రాలు, ఆలయ ప్రాకారం, ప్రయాణికుల సౌకర్యాల కేంద్రం తదితర నిర్మాణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయన్నారు. రామజన్మభూమి ఆలయాన్ని నేరుగా అనుసంధానిస్తూ శ్రీరామ జన్మభూమి మార్గాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రోడ్డుపై అందంగా డిజైన్ చేసిన పింక్ స్టోన్ టైల్స్ ను ఏర్పాటు చేశారు. దీంతో పాటు టెంపుల్ కారిడార్‌ను కూడా అభివృద్ధి చేస్తున్నారు. సుగ్రీవ కోట గుడి పక్కనుంచి వెళ్లే ఈ రహదారిలో అందమైన లైటింగ్ స్థంభాలు ఏర్పాటు చేస్తున్నారు.

Show comments