NTV Telugu Site icon

జైలులో డేరా బాబాకు అస్వ‌స్థ‌త‌..!

Ram Rahim

తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్విలపై అత్యాచారానికి పాల్పడినట్టు తేల‌డంతో.. రోహ్‌తక్‌లోని సునేరియా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు డేరా సచ్చా సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. అయితే, ఆయ‌న మ‌రోసారి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు… తన కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో.. జైలు అధికారులు డేరా బాబాను ఉద‌యం 7 గంట‌ల స‌మ‌యంలో రోహ్‌తక్‌లోని పీజీఐఎంఎస్ ఆస్పత్రికి భారీ పోలీసు భద్రత మ‌ధ్య త‌ర‌లించారు.. ఆస్ప‌త్రిలో వైద్యులు డేరా బాబాకు వివిధ ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన త‌ర్వాత‌.. తిరిగి ఆయ‌న‌ను జైలుకు తరలించారు. అయితే, డేరా బాబా ఆస్ప‌త్రిలో చేర‌డం ఇది తొలిసారి కాదు.. మే 12వ తేదీన కూడా తనకు బాగాలేద‌ని చెప్ప‌డం, బీపీ హెచ్చుతగ్గులతో పీజీఐఎంఎస్ ఆస్పత్రిలో చేర్పించారు అధికారులు.. ఏడుగురు డాక్ట‌ర్ల బృందం ఆయ‌న‌కు చికిత్స అందించి.. ఒక‌రోజు ఆస్ప‌త్రిలో ఉన్న ఆయ‌న‌కు అద‌న‌పు భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు.. మ‌రుస‌టి రోజు తిరిగి జైలుకు త‌ర‌లించారు. ఇప్పుడు మ‌రోసారి అస్వ‌స్థకు గుర‌య్యారు. ఇక‌, షుగ‌ర్, బీపీతో బాధ‌ప‌డుతున్న రామ్ రహీమ్.. రెగ్యుల‌ర్‌గా మందులు కూడా తీసుకుంటున్నార‌ని చెబుతున్నారు. కాగా, సాధ్విల‌పై అత్యాచారం కేసులో.. ఆయ‌న‌కు కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన సంగ‌తి తెలిసిందే.