జైలులో డేరా బాబాకు అస్వస్థత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తన ఆశ్రమంలోని ఇద్దరు సాధ్విలపై అత్యాచారానికి పాల్పడినట్టు తేలడంతో.. రోహ్తక్లోని సునేరియా జైల్లోనే శిక్ష అనుభవిస్తున్నారు డేరా సచ్చా సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్.. అయితే, ఆయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు… తన కడుపులో నొప్పిగా ఉందని చెప్పడంతో.. జైలు అధికారులు డేరా బాబాను ఉదయం 7 గంటల సమయంలో రోహ్తక్లోని పీజీఐఎంఎస్ ఆస్పత్రికి భారీ పోలీసు భద్రత మధ్య తరలించారు.. ఆస్పత్రిలో వైద్యులు డేరా బాబాకు వివిధ పరీక్షలు నిర్వహించిన తర్వాత.. తిరిగి ఆయనను జైలుకు తరలించారు. అయితే, డేరా బాబా ఆస్పత్రిలో చేరడం ఇది తొలిసారి కాదు.. మే 12వ తేదీన కూడా తనకు బాగాలేదని చెప్పడం, బీపీ హెచ్చుతగ్గులతో పీజీఐఎంఎస్ ఆస్పత్రిలో చేర్పించారు అధికారులు.. ఏడుగురు డాక్టర్ల బృందం ఆయనకు చికిత్స అందించి.. ఒకరోజు ఆస్పత్రిలో ఉన్న ఆయనకు అదనపు భద్రత ఏర్పాటు చేశారు.. మరుసటి రోజు తిరిగి జైలుకు తరలించారు. ఇప్పుడు మరోసారి అస్వస్థకు గురయ్యారు. ఇక, షుగర్, బీపీతో బాధపడుతున్న రామ్ రహీమ్.. రెగ్యులర్‌గా మందులు కూడా తీసుకుంటున్నారని చెబుతున్నారు. కాగా, సాధ్విలపై అత్యాచారం కేసులో.. ఆయనకు కోర్టు 20 ఏళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే.
Also Read
- Bihar: తల్లి కోసం కొడుకు సంకల్పం.. పరుగెత్తుకుంటూ 12 జ్యోతిర్లింగాల యాత్ర
- Annamalai: CJPకి ఎప్పటికీ మద్దతు ఇవ్వం, వారి అజెండా వేరు.. అన్నామలై కీలక వ్యాఖ్యలు..
- DK Shivakumar: మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి, నాపై స్టింగ్ ఆపరేషన్.. డీకే శివకుమార్ సంచలన ఆరోపణ..!
- BJP: కాంగ్రెస్‌లో ప్రియాంక గాంధీ vs రాహుల్ గాంధీ.. బీజేపీ సంచలన ఆరోపణలు..
తాజావార్తలు
-
ED Raids: రూ. 326 కోట్ల బ్యాంక్ మోసం కేసు.. హైదరాబాద్‌లో ఈడీ మెరుపు దాడులు
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Vishwak Sen: తరుణ్ భాస్కర్‌ను ‘ఫలక్‌నుమా దాస్’ కోసం 3 నెలలు అడుక్కున్నా..: విశ్వక్ సేన్
-
AP Election Commission: నామినేషన్లపై ఎస్ఈసీ కీలక ఆదేశాలు.. అభ్యర్థులకు మరో అవకాశం
-
AP High Court: నామినేషన్ల గడువు పొడిగించాలి.. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ..
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!