Nitish Kumar: శ్రీరామ నవమి రోజు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, బీహార్, గుజరాత్, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. బీహార్ లోని ససారం, బీహార్ షరీఫ్ ప్రాంతాల్లో రామనవమి ఉత్సవాల సందర్భంగా మతపరమైన ఉద్రికత్తలు చెలరేగడంపై ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ స్పందించారు. రాజకీయ దురుద్దేశం వల్లే ఈ ఘర్షణలు ప్రేరేపించబడ్డాయిన ఆయన అన్నారు. బీహార్ లో ఇలాంటి ఘర్షణలు తొలిసారిగా జరిగాయని, ఇది సహజంగా జరగలేదని, కొందరు వ్యక్తుల వల్లే జరిగాయిని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మతసామరస్యానికి విఘాతం కలిగించబోమని ఆయన తెలిపారు.
Read Also: Kane Williamson: గుజరాత్ టైటాన్స్‌కు షాక్.. ఐపీఎల్ నుంచి కేన్ ఔట్
ఘర్షణల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన బీహార్ పర్యటనను రద్దు చేసుకున్నారు. దీనిపై మాట్లాడుతూ..‘‘ ఆయన ఎందుకు వస్తున్నాడో నాకు తెలియదు, ఎందుకు రావద్దని అనుకుంటున్నాడో అర్థం కాలేదు’’ అంటూ నితిష్ కుమార్ కామెంట్స్ చేశారు. అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చినట్లు సీఎం తెలిపారు. రెండు ప్రాంతాల్లో పోలీసులు భద్రతను పెంచినట్లు వెల్లడించారు. బీహార్ లో రెండు ప్రాంతాల్లో చెలరేగింన మత ఘర్షణల్లో ఇప్పటి వరకు 45 మందిని అరెస్ట్ చేశారు. అల్లర్లలో వాహనాలు, ఇళ్లు, దుకాణాలు తలబడ్డాయి. అనేక మంది గాయాలపాలయ్యారు.
