Rakshabandhan 2022: సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగకు ఇంకెన్ని రోజులు లేవు. ఈ పండుగను జరుపుకునేందుకు దేశమంతా ఎదురుచూస్తోంది. తమ సోదరుల సంరక్షణ, క్షేమం కోరుతూ ప్రతి అక్కా, చెల్లి వారి చేతికి రాఖీ కడతారు. అదే సమయంలో ఎలాంటి కష్టమొచ్చినా తోడుంటానని సోదరుడు భరోసా ఇస్తారు. అంతేకాదు, సోదరి సంతోషించేలా బహుమతులు ఇస్తుంటారు. మరి ఈ రక్షా బంధన్‌కు మీ సోదరికి ఎలాంటి బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారా?. మీరు మీ సోదరికి ఏదైనా బహుమతిగా ఇవ్వాలని చూస్తున్నట్లయితే.. ఈ బహుమతులను వారు ఇష్టపడడమే కాకుండా చాలా ఉపయోగకరంగానూ ఉంట రక్షాబంధన్ కోసం మీ తోబుట్టువులు ఇష్టపడే కొన్ని బహుమతుల జాబితా ఇక్కడ ఉంది. అయితే మీ కోసం కొన్ని బహుమతులను తెలియజేస్తున్నాం. అవేంటో చూడండి.
హెడ్‌ఫోన్స్: పాటలు వినడంతో పాటు మొబైల్ వినియోగిస్తున్నప్పుడు సౌకర్యంగా ఉండే హెడ్ ఫోన్స్ గిఫ్ట్‌గా ఇవ్వండి. రక్షాబంధన్ రోజు మీ సోదరికి ఒక మంచి హెడ్‌ఫోన్ జతను బహుమతిగా ఇచ్చి తనకు ఆనందాన్ని పంచండి. మార్కెట్లో ఎన్నో రకాల హెడ్‌ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్‌ను బట్టి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు.
స్మార్ట్ వాచ్: మీరు మీ ప్రియమైన సోదరికి గాడ్జెట్‌ను బహుమతిగా ఇవ్వాలనుకుంటే, మీరు ఆమెకు స్మార్ట్ వాచ్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. ఈ రోజుల్లో ఇది హెల్త్ ట్రాకర్‌తో సహా అనేక ఫీచర్లతో వస్తుంది. వారు ఈ బహుమతిని చాలా ఇష్టపడతారు. ఇప్పుడు చాలా రకాల స్మార్ట్‌వాచ్‌లు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి.
ల్యాప్‌టాప్: ప్రస్తుతం రోజుల్లో అందరూ టెకీ ప్రియులే. కావున మీ ప్రియమైన సోదరి చదువుతున్నట్లయితే ల్యాప్‌టాప్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. వారికి అది ఎంతగానో ఉపయోగపడుతుంది. మీ సోదరి చదువుకోవడం లేదా సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు చూడటానికి ఇష్టపడితే, ఆమె ఈ బహుమతిని ఇష్టపడుతుంది.
వ్యాయామ పరికరాలు: మీ సోదరి ఫిట్‌నెస్ ఫ్రీక్ అయితే, మీరు ఆమెకు కొత్త యోగా మ్యాట్, వాటర్ బాటిల్ లేదా షేక్ లేదా వ్యాయామ పరికరాలను బహుమతిగా ఇవ్వవచ్చు. వారు ఇప్పటివరకు వారి దినచర్యలో వ్యాయామం చేయకపోతే, మీరు ఈసారి వారిని ప్రేరేపించవచ్చు. మీరు వారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహిస్తున్నారని వారికి తెలియజేయవచ్చు. ఇలా చేయడం వల్ల వారి ఆరోగ్యం బాగా ఉంటుంది. ఓ సోదరికి ఆరోగ్యం పంచడం కూడా మంచి బహుమతే.
బంగారం: చాలా మంది అమ్మాయిలకు బంగారం అంటే చాలా ఇష్టం. రక్షా బంధన్ సందర్భంగా మీరు మీ సోదరికి చెవిపోగులు, బంగారం బ్రాస్‌లెట్‌ను బహుమతిగా ఇచ్చి వారి మోములో చిరునవ్వు తెప్పించండి. వారికి ఇది ఎప్పుడూ గుర్తుంటుంది.
పుస్తకం, పెన్నులు: మీ సోదరికి పుస్తకాలు చదవడం అంటే ఇష్టం ఉంటే, ఆమెకు పుస్తకాలను బహుమతిగా ఇవ్వండి. మీ సోదరుడు లేదా సోదరికి చదవడం అంటే ఇష్టమైతే, మీరు వారికి ఇష్టమైన పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వండి. ఉదాహరణకు లార్డ్ ఆఫ్ ది రింగ్స్, హ్యారీ పోటర్ మొదలైన పుస్తకాలను బహుమతిగా ఇవ్వవచ్చు. రక్షా బంధన్ రోజు కిండ్లేని కూడా బహుమతిగా ఇవ్వవచ్చు. ఇందులో వేలాది ఈ- బుక్స్ అందుబాటులో ఉన్నాయి. రాసుకోవడంతో పాటు మీ గుర్తుగా ఓ పెన్నును బహుమతి ఇవ్వండి.
బ్రాండ్ వోచర్: మీరు మీ సోదరికి ఆమె ఇష్టమైన బ్రాండ్ బహుమతి వోచర్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు. దాని సహాయంతో, వారు తమకు నచ్చిన బట్టలు లేదా చర్మ సంరక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.
మొక్కలు: రాఖీ కట్టిన తర్వాత సోదరుడు తన సోదరిని కాపాడుతానని హామీ ఇస్తాడు. అటువంటి పరిస్థితిలో, మీరు మీ సోదరికి మంచి వాతావరణాన్ని అందించడం ద్వారా ఆమెను రక్షించవచ్చు. అంటే, మీరు ఆమెకు ఇండోర్ ప్లాంట్‌ను బహుమతిగా ఇవ్వవచ్చు, తద్వారా ఆమె స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు.
చాక్లెట్లు: చాక్లెట్లను అందరూ ఇష్టపడతారు. ఈ రక్షా బంధన్ రోజు మీ తోబుట్టువులకు వివిధ రకాల చాక్లెట్లు ఇచ్చి తియ్యటి వేడుక చేసుకోండి.
ఇష్టమైన భోజనం: ఈ రక్షా బంధన్, మీ తోబుట్టువుతో కలిసి మీకు ఇష్టమైన కేఫ్ లేదా రెస్టారెంట్‌కు వెళ్లండి. లేదా ప్రతి ఒక్కరికీ ఇష్టమైన వంటకం అనేది ఒకటి ఉంటుంది. రక్షాబంధన్ రోజు మీ తోబుట్టువుకు ఇష్టమైన వంటకాన్ని స్వయంగా సిద్ధం చేసి ఇవ్వండి. వారు ఖచ్చితంగా ఆనందిస్తారు.
కొత్త బట్టలు, మేకప్ కిట్లు: రక్షా బంధన్ పండుగ సందర్భంగా మీ తోబుట్టువులకు కొత్త బట్టలు కొనుగోలు చేసి బహుమతిగా ఇవ్వొచ్చు.మీ సోదరి కోసం మేకప్ కిట్ బహుమతిగా ఇవ్వండి. ఇది వారికి కచ్చితంగా నచ్చుతుంది. ఆన్లైన్లో అనేక మేకప్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి కస్టమర్ రివ్వ్యూలను పరిశీలించి కొనుగోలు చేయండి.
పెర్ఫ్యూమ్ సెట్: చక్కటి పెర్ఫ్యూమ్ ఎవరినైనా ఉత్సాహపరుస్తుంది. ఈ రక్షా బంధన్ రొజు మీ తోబుట్టువుల కోసం చక్కని పెర్ఫ్యూమ్ను బహుమతిగా ఇవ్వండి.