NTV Telugu Site icon

CBI : రాజ్యసభ ఎంపీ అవుతారా..? గవర్నర్‌గా వెళ్తారా? వంద కోట్లు ఉంటే చాలు..! అసలు విషయం తెలిస్తే షాకే..!

Cbi

Cbi

కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త తరహాలో మోసాలకు తెరలేపుతూనే ఉన్నారు.. స్మార్ట్‌ ఫోన్లు వచ్చిన తర్వాత.. స్మార్టుగా బ్యాంకుల్లో ఉన్న సొత్తును ఖాళీ చేయడమే కాదు.. ఏ విషయంతో ఎవ్వరిని బుట్టాలో వేయవచ్చు..? ఎలా డబ్బులు దండుకోవచ్చు అనే ప్లాన్‌ చేస్తున్నారు.. చిన్నచిన్న మోసాలు చేస్తే.. పవలో పరకో వస్తుంది అనుకున్నారేమో.. ఏకంగా కోట్లనే కొల్లగొట్టాలని ప్లాన్‌ చేశారు.. దండిగా డబ్బులు ఉండి హోదా కోసం ప్రయత్నాలు చేసేవారిని టార్గెట్‌ చేశారు.. మీకు రాజ్య‌స‌భ సీటు కావాలా..? గ‌వ‌ర్న‌ర్ హోదా ఇప్పించాలా..? లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థ‌ల్లో చైర్మెన్ ప‌ద‌వులు కావాలా..? ఇలా కొత్త తరహాలో ఆశచూపి కోట్లు కొల్లగొట్టారు.. పాపం పనులు ఎంతకాలం సాగుతాయి.. మొత్తంగా వంద కోట్లు ఇస్తే రాజ్య‌స‌భ సీటు ఇప్పిస్తామంటూ మోసాల‌కు పాల్ప‌డుతున్న ఓ ముఠా గుట్టును రట్టుచేసింది సీబీఐ.

Read Also: Manchu Lakshmi: ఆమెకు దూరంగా ఉండలేకపోతున్నా.. కన్నీరు పెట్టుకున్న మంచు లక్ష్మీ

మ‌హారాష్ట్ర‌కు చెందిన క‌ర్‌మాల్క‌ర్ ప్రేమ్‌కుమార్ బంద్‌గ‌ర్‌, క‌ర్నాట‌వాసి ర‌వీంద్ర విటల్ నాయ‌క్‌, ఢిలీ నివాసి మ‌హేంద్ర‌పాల్ అరోరా, అభిషేక్ బూరాల‌ను అరెస్టు చేశారు సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ (సీబీఐ) అధికారులు.. రాజ్య‌స‌భ సీటుతో పాటు గ‌వ‌ర్న‌ర్ హోదా, ప్ర‌భుత్వ సంస్థ‌ల్లో చైర్మెన్ ప‌ద‌వులు ఇప్పిస్తామంటూ ఆ ముఠా మోసాల‌కు పాల్ప‌డిన‌ట్లు గుర్తించింది సీబీఐ.. ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారుల‌తో చేతులు క‌లిపి, ఆ పోస్టులు ఇప్పిస్తామంటూ మోసాల‌కు పాల్ప‌డిన‌ట్లు తేల్చారు.. సీబీఐ ఫస్ట్ ఎఫ్ఐఆర్ ప్రకారం.. ఈ పేరుతో ప్రజల నుంచి రూ. 100 కోట్ల వరకు మోసం చేసినట్టు చెబుతున్నారు.. బండ్‌గర్, సీనియర్ సీబీఐ అధికారి వలె నటించి, ఒక మహ్మద్ ఐజాజ్ ఖాన్‌తో సహా ఇతర నిందితులకు భారీ మొత్తానికి ప్రతిఫలంగా తాను పరిష్కరించగల ఏ విధమైన పనినైనా తీసుకురావాలని చెప్పినట్లు వర్గాలు తెలిపాయి. కర్మలాకర్ ప్రేమ్‌కుమార్ బండ్‌గార్, మహేంద్ర పాల్ అరోరా, ఎండీ. అలాజ్ ఖాన్ మరియు రవీంద్ర విఠల్ నాయక్ తరచుగా సీనియర్ బ్యూరోక్రాట్‌లు మరియు రాజకీయ కార్యకర్తల పేర్లను నేరుగా లేదా అభిషేక్ బూరా వంటి మధ్యవర్తి ద్వారా ఏదైనా పని కోసం తమను సంప్రదించే క్లయింట్‌ను ఆకట్టుకోవడం కోసం తరచూ వాడేవరని సీబీఐ తన ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

Show comments