Site icon NTV Telugu

ల‌తా మంగేష్క‌ర్‌కు రాజ్య‌స‌భ నివాళి

గానకోకిల ల‌తా మంగేష్క‌ర్ క‌న్నుమూసింది.. త‌న గాత్రంతో కోట్లాది మంది అభిమానుల‌ను సంపాదించుక‌న్న ఆమె.. సెల‌వు తీసుకున్నారు.. ముంబైలో ఆదివారం రోజు ఆమె అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించారు.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య‌యారు.. ఇక‌, ల‌తా మంగేష్క‌ర్ మృతి ప‌ట్ల రాజ్య‌స‌భ ఇవాళ ఘ‌న నివాళి అర్పించింది. క్వ‌శ్చ‌న్ అవ‌ర్‌ను ర‌ద్దు చేశారు. స‌భ‌ను గంట సేపు వాయిదా వేస్తున్న‌ట్లు రాజ్య‌స‌భ చైర్మెన్ వెంక‌య్య‌నాయుడు తెలిపారు. ల‌తా మంగేష్క‌ర్ మృతి ప‌ట్ల తీవ్ర సంతాపాన్ని వ్య‌క్తం చేసిన వెంక‌య్య నాయుడు.. దేశంలో భిన్న‌త్వం త‌ర‌హాలో ఆమె స్వ‌రంలో ఆ శ‌క్తి ఉంద‌ని కొనియాడారు.. దాదాపు 25 వేల పాట‌ల‌ను ఆల‌పించి ఆమె రికార్డ్ సృష్టించార‌ని.. ఏడు ద‌శాబ్ధాల పాటు దేశంలో ప్ర‌తి ఒక్క‌రి భావోద్వేగాన్ని ఆమె త‌న గ‌ళంలో వినిపించార‌ని పేర్కొన్నారు. ఇక‌, 1999 నుంచి 2005 వ‌ర‌కు ఆమె రాజ్య‌స‌భ స‌భ్యురాలిగా ఉన్న విష‌యాన్ని గుర్తుచేసిన వెంక‌య్య‌.. ఓ లెజెండ‌రీ ప్లేబ్యాక్ సింగ‌ర్‌ను భార‌త దేశం కోల్పోయింద‌ని పేర్కొన్నారు.

Read Also: ర్యాగింగ్ త‌ట్టుకోలేక‌పోతున్నాం.. యాక్ష‌న్ తీసుకోండి.. జేఎన్టీయూ విద్యార్థి విజ్ఞ‌ప్తి

Exit mobile version