వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయి రెడ్డి నేతృత్వంలోని కామర్స్ పార్లమెంటరీ స్థాయీ సంఘం పనితీరును ప్రశంసిస్తూ ఈ రోజు రాజ్యసభలో చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు అభినందించారు. పార్లమెంట్ సమావేశాల విరామ కాలంలో వివిధ పార్లమెంటరీ స్థాయీ సంఘాల పనితీరును విశ్లేషించిన ఆయన కామర్స్ కమిటీ అత్యుత్తమ పనితీరు కనబరిచిందని ప్రశంసించారు.
read also : ఈశాన్య భారతాన్ని వణికిస్తోన్న డెల్టా వైరస్
పార్లమెంట్ విరామ కాలంలో మొత్తం ఆరుసార్లు సమావేశమై 15 గంటల 51 నిమిషాలపాటు వివిధ అంశాలపై చర్చలు జరిపిందని చైర్మన్ తెలిపారు. కమిటీ మొత్తం జరిపిన సమావేశాలలో 31 శాతం ఈ కాలవ్యవధిలోనే నిర్వహించడం పట్ల ఆయన కమిటీ చైర్మన్, సభ్యులను ఆయన అభినందించారు.
