Delhi Ordinance Bill Passed: ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు లోక్‌సభలో శుక్రవారం ఆమోదం పొందగా.. సోమవారం రాజ్యసభలో చర్చకు పెట్టారు. ఆర్డినెన్స్ స్థానంలో తీసుకొచ్చిన బిల్లును లోక్‌సభ గత శుక్రవారం ఆమోదించిన విషయం తెలిసిందే. సోమవారం అమిత్ షా రాజ్యసభలో బిల్లును ప్రవేశ పెట్టారు. బిల్లుకు అనుకూలంగా 131 మంది ఓట్లు వేయగా.. వ్యతిరేకంగా 102 మంది ఓటు వేశారు. సాంకేతిక సమస్య నేపథ్యంలో స్లిప్పుల ద్వారా రాజ్యసభలో ఓటింగ్‌ను నిర్వహించారు. అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభ బిల్లును ఆమోదించడంతో చట్టం చేయడం కోసం రాష్ట్రపతి ఆమోదం కోసం కేంద్రం బిల్లును రాష్ట్రపతి భవన్‌కు పంపించింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు కాస్త చట్టంగా మారనుంది.
Read also: Yashikaa Annand: బుల్లి గౌన్ వేసుకొని.. పెద్ద అందాలనే చూపిస్తుందే
ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇచ్చే విషయంలో మాజీ ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ చెప్పినట్టుగా కాకుండా .. బీజేపీ నేత మాజీ ప్రధాని వాజ్‌పేయి చెప్పినట్టుగా ఆలోచించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా చర్చ సందర్భంగా సూచించారు. మనమంతా కలిసికట్టుగా ఈ బిల్లును వ్యతిరేకించాలి. ఎందుకంటే ఈ తరహా ఫెడరలిజం ఏదోఒక రోజు మీ ఇంటి తలుపు కూడా తట్టొచ్చు’ అని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వి బిల్లుకు మద్దతు ఇస్తున్న పార్టీలను హెచ్చరించారు. ఈ సందర్భంగా జర్మన్ థియోలాజియన్ మార్టిన్ నీమొల్లర్ చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. ‘క్లిష్టసమయంలో మనం ఎవరి తరఫున నిల్చోకుండా తప్పించుకుంటే.. మనకు అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మన తరఫున నిల్చొని మాట్లాడటానికి ఎవరూ ఉండరు’ అని అన్నారు.
రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాఘవ్ చద్దా కేంద్రంపై విమర్శలు చేశారు. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర స్థాయి హోదాను కోరుకునే తమ సొంత నాయకులైన అటల్ బిహారీ వాజ్‌పేయి మరియు ఎల్‌కె అద్వానీలను అనుసరించాలని అమిత్ షాకు సూచించారు.
Read also: CM KCR : సియాసత్ మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
‘‘ఢిల్లీ సర్వీసుల బిల్లు సుప్రీం కోర్టు తీర్పును ఏ విధంగానూ ఉల్లంఘించలేదు. దేశ రాజధానిలో సమర్థవంతమైన, అవినీతి రహిత పాలనను అందించాలన్న లక్ష్యంతోనే ఈ బిల్లును తీసుకొచ్చాం.’’ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. వాస్తవంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ బిల్లును తొలిసారిగా తీసుకొచ్చారని అమిత్ షా గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో తీసుకొచ్చిన బిల్లులోని ఏ ఒక్క నిబంధననీ మార్చలేదని అమిత్ షా తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీని తమ వైపు రాబట్టకోవడం కోసమే కాంగ్రెస్ గతంలో తీసుకొచ్చిన బిల్లును తానే వ్యతిరేకిస్తోందని హోం మంత్రి విమర్శించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో రాజధాని ప్రాంతంలోని అధికారులు మరియు ఉద్యోగుల విధులు, ఇతర సర్వీసులకు సంబంధించిన నిబంధనలను రూపొందించేందుకు కేంద్రానికి అధికారం వస్తుందని అమిత్ షా తెలిపారు.
