Site icon NTV Telugu

Rajnath Singh-IAS Trainees: ఐఏఎస్ శిక్షణా కేంద్రంలో రాజ్‌నాథ్‌సింగ్‌కు వింత అనుభవం.. ఏం జరిగిందంటే..!

Rajnath Singh

Rajnath Singh

ఐఏఎస్.. దేశంలోనే ఎంతో పవర్‌ఫుల్ ఉద్యోగం. ఐఏఎస్‌కు సలెక్ట్ కావడం మామూలు విషయం కాదు. యూపీఎస్సీ నిర్వహించే టెస్టుల్లో నెగ్గుకు రావాలి. ఎన్నో వడపోతల తర్వాత సలెక్ట్ అవుతారు. ఎంతో మేధావులైతేనే తప్ప ఈ ఉద్యోగం సాధించడం అంత ఈజీ కాదు. ఇప్పుడెందుకు ఇదంతా అంటారా? అయితే ఈ వార్త చదవ్సాలిందే.

ఉత్తరాఖండ్‌లోని లాల్ బహుదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA)లో దాదాపు 600 మంది ఐఏఎస్‌లుగా శిక్షణ పొందుతున్నారు. సోమవారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అకాడమీ సెంటర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రొఫెసర్‌ అవతారం ఎత్తారు. ఐఏఎస్ ప్రొబెషనర్లను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ క్రమంలో ఒక వింతైన సంఘటన చోటుచేసుకుంది. ప్రసంగం మధ్యలో ఐఏఎస్‌ ప్రొబెషనర్లకు గణితం నుంచి ఒక ప్రశ్న వేశారు. చాలా సింఫుల్‌గా తేలికైనే ప్రశ్ననే వేశారు. అందరూ చెప్పేస్తారేమోనని రాజ్‌నాథ్‌సింగ్ భావించారు. కానీ అందరూ తెల్లమొహం వేశారు. ఒక్కసారిగా హాలు అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. దీంతో కేంద్ర మంత్రి అవాక్కయ్యారు.

ప్రశ్న ఇదే..
‘‘ఒక వ్యక్తి దగ్గర చాలా డబ్బు ఉంది. అతను సగం Aకి, మూడింట ఒక వంతు Bకి ఇచ్చాడు. మిగిలిన 100 మొత్తాన్ని Cకి ఇచ్చాడు. మొత్తం ఎంత అని రాజ్‌నాథ్‌‌సింగ్ అడిగారు. ఒక్కసారిగా హాల్ నిశ్శబద్దంగా మారిపోయింది. దీంతో మరోసారి ప్రశ్నను పునరావృతం చేశారు. అయినా కూడా ఎవరు నుంచి సమాధానం రాలేదు. కొంత సమయం తర్వాత ఒక ప్రొబెషర్ సమాధానం చెప్పడానికి ప్రయత్నించారు. ‘‘రూ.3000’’ అని చెప్పారు. దీంతో రాజ్‌నాథ్‌సింగ్ చిరునవ్వుతో తల అడ్డంగా ఊపారు. తప్పు చెప్పారు.. మళ్లీ ప్రయత్నించండి అని బదులిచ్చారు.

అనంతరం 49 సెకన్ల తర్వాత జనసమూహం నుంచి ఎవరో ‘‘రూ.600’’ అని సమాధానం ఇచ్చారు. వెంటనే రూ.600 అని చెప్పింది ఎవరూ అని అడిగారు. వెంటనే ఒక శిక్షణార్థి చేయి పైకెత్తారు. రాజ్‌నాథ్‌సింగ్ నవ్వి… అవును నిజమే చెప్పారంటూ వ్యాఖ్యానించారు. 600 మంది ప్రొబెషనర్లలో ఒక్కరే సమాధానం ఇచ్చారు.

జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో యువ పౌర సేవకులు తమ కీలక పాత్రను అర్థం చేసుకోవాలని.. ధైర్య సైనికుల మాదిరిగానే క్లిష్ట పరిస్థితులకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: Karnataka: నేడు డీకే ఇంట్లో సిద్ధరామయ్యకు బ్రేక్‌ఫాస్ట్.. కీలక నిర్ణయం వెలువడే అవకాశం!

Exit mobile version