Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్‌పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్

  • మహిళా కానిస్టేబుల్ ప్రవర్తన తీవ్ర విమర్శలకు దారితీసింది
  • టేబుల్‌పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
  • వైరల్ ఫొటోతో పోలీసు శాఖలో కలకలం
Rajasthan Woman Cop

Rajasthan Woman Cop

రాజస్థాన్‌లో ఓ మహిళా కానిస్టేబుల్ ప్రవర్తన తీవ్ర విమర్శలకు దారితీసింది. ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఓ వృద్ధుడి ఎదుట టేబుల్‌పై కాళ్లు పెట్టుకుని కూర్చున్న ఆమె ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారులు వెంటనే చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశిస్తూ సంబంధిత మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు.

ఏం జరిగింది?

ఈ ఘటన రాజస్థాన్‌లోని డూంగర్‌పూర్ జిల్లా బిచ్చీవాడా పోలీస్ స్టేషన్లో చోటుచేసుకుంది. తన సమస్యను వివరించేందుకు వచ్చిన ఓ వృద్ధుడు పోలీస్ స్టేషన్‌లో నిలబడి ఉండగా, విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ టేబుల్‌పై కాళ్లు పెట్టుకుని నిర్లక్ష్యంగా కూర్చున్న దృశ్యం అక్కడే ఉన్నవారు ఫొటో తీశారు. ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

వైరల్ ఫొటోతో పోలీసు శాఖలో కలకలం

ఫొటో వైరల్ కావడంతో రాజస్థాన్ పోలీస్ శాఖ వెంటనే స్పందించింది. ప్రజలతో మర్యాదగా, గౌరవంగా వ్యవహరించాల్సిన పోలీసు సిబ్బంది ఇలాంటి ప్రవర్తించడం అంగీకారయోగ్యం కాదని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. డూంగర్‌పూర్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపి, మహిళా కానిస్టేబుల్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తూ శాఖాపరమైన దర్యాప్తు ప్రారంభించారు.

ప్రజల్లో ఆగ్రహం

వృద్ధుడి సమస్య వినాల్సిన బాధ్యత ఉన్న పోలీసు సిబ్బంది ఈ విధంగా ప్రవర్తించడం పట్ల స్థానికులు, సోషల్ మీడియా యూజర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాల్సిన పోలీసులు గౌరవప్రదంగా వ్యవహరించాలని పలువురు అభిప్రాయపడ్డారు.

పోలీసుల హెచ్చరిక

ఈ ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ప్రజల పట్ల అమర్యాదగా ప్రవర్తించే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై శాఖాపరమైన విచారణ కొనసాగుతోంది.