Site icon NTV Telugu

IMD Warning: పలు రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!

Delhirain

Delhirain

కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. గత కొద్దిరోజులుగా పొల్యుషన్‌తో సతమతం అవుతున్న దేశ రాజధాని ఢిల్లీకి ఐఎండీ శుభవార్త చెప్పింది. ఉత్తర భారత్‌లోని పలు రాష్ట్రాల్లో వర్ష కురుస్తుందని తెలిపింది. ఢిల్లీ సహా ఉత్తర ప్రదేశ్, పంజాబ్, హర్యారాలో వర్షం కురుస్తుందని అలర్ట్ చేసింది. హిమాలయ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

ఇది కూడా చదవండి: JD Vance: గుడ్‌న్యూస్ చెప్పిన జేడీ వాన్స్ దంపతులు

ప్రస్తుతం ఢిల్లీలో చలిగాలులు లేవు.. పొగమంచు కనిపించడం లేదు. వాతావరణంలో జరిగిన మార్పులు కారణంగా ఆహ్లాదకరంగా మారింది. ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ వరకు… ఉత్తరాఖండ్ నుంచి కాశ్మీర్ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తొలుత కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే హిమపాతం కూడా ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఇక ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో తేలికపాటి లేదా మితంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

ఇదిలా ఉంటే జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో మేఘాలు కమ్ముకుంటాయని.. బలమైన గాలులు.. తేలికపాటి వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఇది కూడా చదవండి: Free LPG Cylinder Scheme: హోలీకి ముందు పేదలకు గుడ్‌న్యూస్.. ఉచితంగా LPG సిలిండర్‌

Exit mobile version