Site icon NTV Telugu

Railways: కదులుతున్న రైలు డోర్ దగ్గర కొబ్బరి కాయ కొట్టిన ఉద్యోగి.. చర్యలు తీసుకోవాలన్న ప్రయాణీకులు

Untitled Design (4)

Untitled Design (4)

ఇండియన్ రైల్వేస్ కు సంబంధించిన మరో సంఘటన ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారి విస్తృత చర్చకు దారితీసింది. గతంలో ఓ రైల్వే ఉద్యోగి కదులుతున్న రైలు డోర్ దగ్గర వాటర్ తో కడిగి కొబ్బరి కాయ కొట్టాడు. ఇది హిందూ సంప్రదాయంలో ఓ భాగం. దీనిపై కొన్ని విమర్శలు వచ్చినప్పటికి.. ఎక్కువ శాతం సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అరారియాకు చెందిన అంకిత్ శర్మ అనే వ్యక్తి కోచ్ మెట్లను నీటితో శుభ్రం చేసి.. ట్రైన్ డోర్ దగ్గర కొబ్బరి కొట్టి మొక్కుకున్నాడు. మరో వ్యక్తి ఈ తతంగానంతా వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే.. అతను ప్రవేశ ద్వారం నుండి విరిగిన కొబ్బరి ముక్కలను తీసివేసినప్పటికీ, అతని చర్య ఇప్పటికీ భద్రతా సమస్యలను లేవనెత్తింది. క్లిప్‌ను పోస్ట్ చేసిన వ్యక్తి ఇటువంటి చర్యల వల్ల ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని మండిపడ్డాడు. ఎవరైనా రన్నింగ్ ట్రైనింగ్ ఎక్కబోయి జారిపడితే దానికి ఎవరూ బాధ్యత వహిస్తారో చెప్పాలన్నాడు.

అదే వ్యక్తి షేర్ చేసిన మరో వీడియోలో మరో రైల్వే ఉద్యోగి ఇలాంటి ఆచారాన్ని చేస్తున్నట్లు చూపించారు. రైలు నెమ్మదిగా స్టేషన్ నుండి బయలుదేరుతుండగా ఆ వ్యక్తి మెట్లను నీటితో కడిగి, కొబ్బరికాయను పగలగొట్టాడు. కొబ్బరికాయలోని నీటిని రైలు కోచ్ అంతా చల్లాడు. వేరే క్లిప్‌లో, ఒక రైల్వే ఉద్యోగి ప్యాంట్రీ కారులో హరతీ ఇస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ వీడియోలు ఆన్‌లైన్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. కొంతమంది వినియోగదారులు ఉద్యోగులను సమర్థిస్తూ, ఆచారాలను విశ్వాసం , భక్తికి చిహ్నంగా అభివర్ణించగా, మరికొందరు ప్రయాణీకుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.

ఓ ప్రయాణీకుడు మాత్రం డోర్ దగ్గర తడి ఉంటే జారి పడే అవకాశం ఉంటుందని.. ఇది కరెక్ట్ కాదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి వీడియోలను చూసినప్పటికీ రైల్వే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరాడు. అయితే మరో వ్యక్తి మాత్రం.. వీడియో తీసిన ప్రశ్నించిన వ్యక్తిని ఇలా అన్నాడు. నువ్వు ఎప్పుడైనా.. మీ ఇంట్లో కొబ్బరికాయ కొట్టి మీ అమ్మనాన్న కాళ్లు కడిగావా అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చాడు. ఈ విషయంపై రైల్వే కూడా స్పందించి ఉద్యోగులు వివరాలు తెలపాలని కోరింది.

Exit mobile version