NTV Telugu Site icon

Rahul Gandhi: పాంగాంగ్‌ సరస్సు వద్ద రాజీవ్‌గాంధీకి నివాళులర్పించిన రాహుల్‌

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: మాజీ ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీ 79వ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ నివాళులర్పించారు. లడఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్ద రాహుల్‌ గాంధీ తన తండ్రి రాజీవ్‌గాంధీకి ఘనంగా నివాళులర్పించారు. గత 4 రోజులుగా లడఖ్‌లో పర్యటిస్తున్న రాహుల్‌ పాంగాంగ్‌ సరస్సు వద్ద రాజీవ్‌గాంధీకి నివాళులర్పించారు. ఆదివారం ఆయనకు లడఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్ద నివాళులు అర్పించిన రాహుల్‌ ‘‘మా నాన్న (రాజీవ్‌) చాలా సంవత్సరాల క్రితం ఇక్కడకు వచ్చారు. పాంగాంగ్‌.. ప్రపంచంలోనే అత్యంత అందమైన ప్రాంతమని చెప్పారు. ఈ సరస్సు అంటే ఆయనకు చాలా ఇష్టం. అందుకే ఆయన జయంతి రోజున ఇక్కడకు వచ్చానని రాహుల్‌ పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాళులర్పించారు. రాజీవ్‌ గాంధీ1984 నుండి 1989 వరకు భారతదేశ 7వ ప్రధానమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. రాజీవ్ గాంధీ ఆగస్టు 20, 1944న జన్మించారు.

Read also: Karnataka : కాపురంలో చిచ్చుపెట్టిన ఫోన్.. అతి కిరాతకంగా భార్యను హత్య చేసి..

ఒక్క అంగుళం కూడా కబ్జా చేయలేదని గతంలో ప్రధాని మోడీ చేసిన ప్రకటనలో నిజం లేదని, భారత్‌ భూభాగాన్ని చైనా ఆక్రమించిందని రాహుల్‌ గాంధీ తెలిపారు. ‘ఇక్కడ ప్రజలందరూ చైనా చొరబడిందనే చెబుతున్నారు. పశువులను మేపే స్థలం ఆక్రమణకు గురైందని అంటున్నారని.. ఇప్పుడు అక్కడికి వెళ్లలేకపోతున్నామని ప్రజలు చెబుతున్నారని అన్నారు. రాహుల్‌ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ స్పందించింది. రాహుల్‌ బీజింగ్‌ ప్రచార యంత్రంగా పనిచేస్తూ.. భారత్‌ పరువు తీస్తున్నారని విమర్శించింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ శనివారం లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు వద్దకు బైక్ రైడ్‌ చేశారు. ఆదివారం ఉదయం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని పాంగాంగ్ సరస్సు ఒడ్డున ప్రార్థనా సమావేశం నిర్వహించగా.. అందులో పాల్గొన్నారు. గురువారం కేంద్ర పాలిత ప్రాంతంలో తన రెండు రోజుల పర్యటన కోసం లడఖ్‌ లేఖ్‌ చేరుకున్న రాహుల్‌ గాంధీ.. తరువాత తన పర్యటనను ఆగస్టు 25 వరకు పొడిగించాలని నిర్ణయించుకున్నారు. ఆగస్ట్ 5, 2019న ఆర్టికల్ 370 మరియు 35 (A)ని తొలగించిన తర్వాత.. జమ్మూ కాశ్మీర్‌ను లడఖ్ మరియు జమ్మూ & కాశ్మీర్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత రాహుల్‌ లడఖ్‌కు వెళ్లడం ఇదే తొలిసారి. ఆగస్టు 25న జరిగే 30 మంది సభ్యుల లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ (ఎల్‌హెచ్‌డిసి)-కార్గిల్ ఎన్నికల సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 10న జరగనున్న కార్గిల్ కౌన్సిల్ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ (బిజెపి)కి వ్యతిరేకంగా కాంగ్రెస్ మరియు నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నికల పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.