Rahul Gandhi: రాష్ట్రపతి ‘‘ఓట్ చోరీ’’కి ఆధారాలు అడిగారు..

  • రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతలు..
  • ఓట్ చోరీ జరుగుతుందని వినతిపత్రం సమర్పణ..
  • రాష్ట్రపతి ఆధారాలు కోరారని రాహుల్ గాంధీ వ్యాఖ్యలు..
Rahul Gandhi (3)

Rahul Gandhi (3)

Rahul Gandhi: ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ద్వారా ఓట్లను తొలగించారని, దీనికి ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఆరోపణలతో శుక్రవారం రాత్రి ఇండియా కూటమికి చెందిన 10 మంది ఎంపీలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యారు. భేటీ తర్వాత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, దేశమంతా ఈ విషయాన్ని చూపిందని. రాష్ట్రపతి తమ ఆరోపణల్ని ఖండించలేదని, ఆధారాలు చూపించాలని కోరారని’’ రాహుల్ పేర్కొన్నారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరుతూ రాష్ట్రపతికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ రద్దు చేయాలని, ముసాయిదా జాబితా నుంచి తొలగించినట్లు చెప్పబడుతున్న సుమారు 13 కోట్ల మంది ఓటర్లను తిరిగి చేర్చాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రపతిని రాహుల్ గాంధీ నేతృత్వంలోని 10 మంది నేతలు కలిశారు. 16 పార్టీలకు చెందిన 16 మంది నేతలు రాష్ట్రపతికి సమర్పించిన వినతిపత్రంపై సంతకాలు చేశారు.