NTV Telugu Site icon

Rahul Gandhi: తొక్కిసలాట జరిగిన హత్రాస్‌లో పర్యటించనున్న రాహుల్ గాంధీ..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: 120కి పైగా ప్రజల ప్రాణాలను తీసిన భయంకరమైన తొక్కిసలాట ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగింది. ఈ ఘటన దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భోలో బాబాగా పిలువబడే వ్యక్తి నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమానికి లక్షల మంది జనాలు రావడం, బాబా పాదధూళి కోసం జనాలు ఎగబడటం ఒక్కసారిగా తొక్కిసలాటకు కారణమైంది. ఈ ఘటనలో 123 మంది మరణించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోడీతో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇతర దేశాధినేతలు ఈ సంఘటనపై తమ సంతాపాన్ని తెలియజేశారు. తొక్కిసలాట దుర్ఘటనపై విచారణకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేసింది.

Read Also: Brain-eating amoeba: “మెదడును తినే అమీబా” ఇన్ఫెక్షన్‌తో 14 ఏళ్ల బాలుడి మృతి..

ఇదిలా ఉంటే ఈ విషాద ఘటన జరిగిన హత్రాస్ ప్రాంతాన్ని సందర్శించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భావిస్తున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కెసి వేణుగోపాల్ ఈ ఉదయం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ గాంధీ హత్రాస్‌లో పర్యటించే యోచనలో ఉన్నారని చెప్పారు. తొక్కిసలాట గురించి ఆయన మాట్లాడుతూ.. ఇది దురదృష్టకర సంఘటన, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు (రాహుల్ గాంధీ) హత్రాస్‌ను సందర్శించాలని యోచిస్తున్నారు. ఆయన అక్కడికి వెళ్లి బాధిత ప్రజల పరామర్శిస్తారని చెప్పారు.

80 వేల మంది సరిపడే సౌకర్యాలు ఉన్నప్పటికీ 2.5 లక్షల మంది సత్సంగ్‌కి చేరుకోవడం కూడా ప్రమాద తీవ్రతను పెంచాయి. ఈ ఘటనకు కారణమైన భోలే బాబా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఘటన జరిగినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. అయితే, నిన్న అతని లాయర్ ద్వారా ఓ ప్రకటన చేస్తూ.. ఘటనలో సంఘ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందని ఆరోపించారు.