Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- ‘‘దేశానికి జరిగినది దేశద్రోహం.. ఎవరూ తప్పించుకోలేరు’’: రాహుల్ గాంధీ
- మోదీ, షా, భగవత్‌పై రాహుల్ తీవ్ర ఆరోపణలు
- జ్ఞానేష్ కుమార్ వారికి సహకరించారని ఆరోపణ
- ‘‘బీజేపీని ఎదుర్కోవడం కాదు.. పూర్తిగా ఓడిస్తాం’’ అంటూ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనాయా చేయాలని ఈరోజు( మంగళవారం) కాంగ్రెస్, ప్రతిపక్ష నేతలు ఎన్నికల ప్రధాన కార్యాయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులకు, ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలకు మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఈ నిరసనల్లో పాల్గొన్న లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసీని విమర్శిస్తూ కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. వీరంతా కలిసి ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
‘‘ మన దేశానికి జరిగింది దేశద్రోహం. ఎవరూ తప్పించుకోలేరు’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఓట్ల చోరీ ద్వారా మోడీ, అమిత్ షా, మోహన్ భగవత్ దేశాన్ని హైజాక్ చేశారని ఆరోపించారు. ఈ ప్రక్రియకు జ్ఞానేష్ కుమార్ సహకరించారని విమర్శించారు. బీజేపీని ఎదుర్కోవడమే తమ లక్ష్యం కాదని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పోరాడుతున్నామని అన్నారు. వారిని ఓడిస్తామంటూ బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు.
Also Read
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్) ద్వారా ఓటర్లను తొలగించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈసీ కార్యాలయానికి కాంగ్రెస్ , ఇతర ప్రతిపక్షాలు ర్యాలీగా వెళ్లి ముట్టడించే ప్రయత్నం చేశాయి. ఆకాశవాణి భవన్ సమీపంలో రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వీరిద్దరూ రోడ్డుపైనే కూర్చుని నిరసన తెలిపారు. ప్రతిపక్ష ఎంపీలు సీఈసీని కలవాలని అనుకుంటున్నారని, కానీ పోలీసులు ఇక్కడే నిలిపేశారని, కానీ జ్ఞానేష్ కుమార్ భయపడుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, టీఎంసీ ఎంపీలు అభిషేక్ బెనర్జీ, డెరిక్ ఓబ్రెయిన్ సహా పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
-
Harish Rao: రాష్ట్రంలో ఒకవైపు కరెంట్ కోతలు.. మరోవైపు కరెంటు బిల్లులతో వాతలు..
-
Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్‌కు బిగ్ షాక్.. సగం ధరకే విక్రయం!
-
Lagadapati Sridhar: చిన్న సినిమాలను తొక్కేస్తున్నారా? లగడపాటి శ్రీధర్ సంచలన కామెంట్స్!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
ట్రెండింగ్
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!