Site icon NTV Telugu

Rahul Gandhi: కుటుంబ సభ్యులతో న్యూఇయర్ వేడుకలకు రాహుల్‌గాంధీ ప్లాన్.. ఎక్కడంటే..!

Raulgandhi

Raulgandhi

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ న్యూఇయర్ వేడుకలు గ్రాండ్‌గా నిర్వహించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి కుటుంబ సభ్యులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ప్లాన్ చేశారు. రణథంబోర్ నేషనల్ పార్క్‌లో ఈ వేడుకలు జరుపుకోనున్నారు.

రణథంబోర్ నేషనల్ పార్క్‌..
రణథంబోర్ నేషనల్ పార్క్‌ ఉత్తర భారతదేశంలోని రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ పట్టణానికి సమీపంలో ఉంది. ఇది విస్తారమైన వన్యప్రాణాలు అభయారణ్యం. ఒకప్పుడు ఇది రాజు వేట స్థలం. ఇక్కడు పులులు, చిరుతలు, మొసళ్లు ఎక్కువగా ఉంటాయి. ఇక కొండపై 10వ శతాబ్దపు రణథంబోర్ కోట, గణేష్ మందిర్ ఆలయం ఉన్నాయి. ఇక ఉద్యానవనంలో పదం తలావ్ సరస్సు నీటి కలువలకు ప్రసిద్ధి చెందింది.

రణథంబోర్ అనేది ప్రకృతికి నిలయం. అంతేకాకుండా గోప్యత, సౌకర్యానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దీంతో నూతన సంవత్సర వేడుకలకు బాగుంటుందన్న ఉద్దేశంతో గాంధీ ఫ్యామిలీ ఈ జాతీయ పార్కును ఎంచుకుంది.

టైగర్ రిజర్వ్‌కు దగ్గరగా ఉన్న ఐదు నక్షత్రాల లగ్జరీ రిసార్ట్‌లో జనవరి 2 వరకు బస చేయనున్నారు. ఇప్పటికే ప్రియాంక గాంధీ వాద్రా కుమారుడు రెహాన్ వాద్రా రణథంబోర్ చేరుకున్నట్లు సమాచారం. తన స్నేహితురాల అవివా బేగ్‌తో చేరుకున్నట్లు వర్గాలను బట్టి తెలుస్తోంది. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ ఇప్పటికే ఈ జాతీయ పార్కును సందర్శించారు. ఇప్పుడు రెండోసారి దర్శిస్తున్నారు. ఇక ప్రియాంగాగాంధీ అయితే ఇది మూడోసారి.

Exit mobile version