Site icon NTV Telugu

Raghav chadha: సీఏ నుంచి ఆప్‌ను కూల్చేదాకా.! రాఘవ్ చద్దా ఎవరు..?

Raghav Chadha (1)

Raghav Chadha (1)

Raghav chadha: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ను రాఘవ్ చద్దా ఘోరమైన దెబ్బ కొట్టారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాజ్యసభ ఆప్ ఎంపీల్లో 2/3 వంతు ఎంపీలు బీజేపీలో చేరారు. ఇటీవల చద్దాను ఆప్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా తొలగించడంతో వివాదం మొదలైంది. అప్పటి నుంచి పార్టీకి, చద్దాకు మధ్య విభేదాలు ఏర్పడ్డాయి.

2013లో అన్నా హజారే ‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ ఉద్యమం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, రాఘవ్ చద్దాలను కలిపింది. అప్పటికే దేశంలో టాప్ చార్టర్ అకౌంటెంట్(సీఏ)గా పేరు తెచ్చుకున్న రాఘవ్ చద్దా పేరు జనాలకు మరింతగా చేరువైంది. కేజ్రీవాల్‌తో చద్దాకు మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆప్ వ్యవస్థాపక సభ్యుల్లో చద్దా ఒకరు.

Read Also: Giorgia Meloni Jhumka: ఝుమ్కా లుక్‌తో భారత్‌ను ఆకట్టుకున్న ఇటలీ ప్రధాని మెలోని..

రాజకీయాలకు రాకముందు రాఘవ్ చద్దా 22 ఏళ్ల వయసులోనే సీఏ అయ్యారు. చిన్న వయసులోనే దేశంలో అత్యధిక పన్ను చెల్లింపుదారుడిగా పేరు తెచ్చుకున్నారు. చద్దా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చదువుకున్నారు. ఆ తర్వాత డెలాయిట్, థోర్న్‌టన్ అనే మల్టీనేషనల్ ఆడిల్ కన్సల్టింగ్ సంస్థల్లో పనిచేశారు.

ఆప్‌లో చేరిన తర్వాత అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఢిల్లీ జన్‌ లోక్‌పాల్ బిల్లు ముసాయిదా బాధ్యతల్ని చద్దాకు అప్పగించారు. బిల్లు రూపొందించిన రాహుల్ మెహ్రాకు చద్దా సాయం చేశారు. ఆప్ వెబ్ సైట్ ప్రకారం.. 2013 ఆప్ మానిఫెస్టో రూపకల్పనలో చద్దా కీలకంగా వ్యవహరించారు. కేజ్రీవాల్ టీంలో వాలంటీర్‌గా చేరిన చద్దా, తక్కువ సమయంలోనే కేజ్రీవాల్‌కు అత్యంత విశ్వసనీయ వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. రాఘవ్ చద్దా ఆప్ యూత్ వింగ్, మీడియా ప్రతినిధిగా కీలకంగా వ్యవహరించారు.

Exit mobile version