Raghav Chadha: రాఘవ్ చద్దాకు కీలక పదవి.. ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- రాఘవ్ చద్దాకు కీలక పదవి
- ప్రత్యేక బాధ్యతలు అప్పగించిన రాజ్యసభ ఛైర్మన్
- ఇటీవలే ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆమ్ ఆద్మీ పార్టీని వీడి బీజేపీలో చేరిన రాఘవ్ చద్దాకు రాజ్యసభ ఛైర్మన్ రాధాకృష్ణన్ కీలక బాధ్యతలు అప్పగించారు. రాజ్యసభ పిటిషన్ల కమిటీకి కొత్త ఛైర్మన్‌గా నియమితులయ్యారు. రాజ్యసభ ఛైర్మన్ రాధాకృష్ణన్ ఈ కమిటీని పునర్వ్యవస్థీకరించి.. 10 మంది సభ్యులను నియమించారు. ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేశారు.
రాజ్యసభ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. మే 20 నుంచి అమల్లోకి వచ్చేలా ఛైర్మన్ పిటిషన్ల కమిటీని పునర్వ్యవస్థీకరించారు. ఈ ప్యానెల్‌కు సభలోని పది మంది సభ్యులను నియమించారు. అందులో రాఘవ్ చద్దా ఛైర్మన్‌గా నియమితులయ్యారని పేర్కొంది.
Also Read
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
రాఘవ్ చద్దాతో పాటు హర్ష్ మహాజన్, గులాం అలీ, శంభు శరణ్ పటేల్, మయాంక్‌కుమార్ నాయక్, మస్తాన్ రావ్ యాదవ్ బీదా, జేబీ మాథర్ హిషామ్, సుభాశిష్ ఖుంటియా, ర్వాంగ్రా నార్జారీ, సంతోష్ కుమార్ పిటిషన్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. దీంతో పాటు రాజ్యసభ సచివాలయం జారీ చేసిన మరో నోటిఫికేషన్లో 2026 మే 20న ‘కార్పొరేట్ చట్టాల (సవరణ) బిల్లు-2026పై సంయుక్త కమిటీలో రాజ్యసభ సభ్యురాలు డాక్టర్ మేనకా గురుస్వామిని సభ్యురాలిగా రాజ్యసభ ఛైర్మన్ నామినేట్ చేసినట్లు పేర్కొంది.
ఇదిలా ఉండగా లోక్‌సభ స్పీకర్ మే 21 నుంచి అమల్లోకి వచ్చేలా ‘కార్పొరేట్ చట్టాల (సవరణ) బిల్లుపై ఏర్పాటైన సంయుక్త కమిటీకి అరవింద్ గణపత్ సావంత్‌ను నామినేట్ చేసినట్లు లోక్‌సభ సెక్రటేరియట్ ఒక ప్రత్యేక నోటిఫికేషన్లో తెలిపింది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?